Breaking News

ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు!

Published on Wed, 01/07/2026 - 04:09

కోటా (రాజస్థాన్‌): అది ఆదివారం రాత్రి.. రాజస్థాన్‌లోని కోటా నగరంలో సుభాష్‌ కుమార్‌ రావత్‌ తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లి ప్రశాంతంగా ఇంటికి తిరిగి వచ్చారు. తాళం తీసి లోపలికి వెళ్లిన ఆ దంపతులకు గుండె ఆగినంత పనైంది. గాలి కోసం పెట్టిన ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ రంధ్రంలో ఒక వింత ఆకారం వేలాడుతూ కనిపించింది. 

సగం లోపల.. సగం బయట! 
నేలకి పది అడుగుల ఎత్తులో.. తల, చేతులు ఇంట్లోకి వచ్చి ఉన్నాయి.. కాళ్లు మాత్రం బయట గాలిలో ఊగుతున్నాయి. సరిగ్గా గమనిస్తే అర్థ్ధమైంది.. ఆ ఆకారం ఒక ’దొంగ’ ప్రబుద్ధుడిదని.. ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ రంధ్రం గుండా దూరి లోపలికి రావాలని ప్రణాళిక వేసి, నడుము భాగం దగ్గర గట్టిగా ఇరుక్కుపోయాడు. పాపం, అటు లోపలికి రాలేక, ఇటు బయటకి వెళ్లలేక బావురుమన్నాడు. 

ఇరుక్కుపోయినా తగ్గని ’ఈగో’!
రావత్‌ దంపతులు తేరుకుని, ‘ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు?’.. అని గట్టిగా అరిచారు. సాధారణంగా దొంగలు దొరికిపోతే కాళ్లావేళ్లా పడతారు. కానీ మన దొంగ రూటే వేరు! ఇరుక్కుపోయినా కూడా, ఇంటి యజమానులనే బెదిరించడం మొదలుపెట్టాడు. ‘నన్ను ఇప్పుడే వదిలేయండి. నా మనుషులు బయటే ఉన్నారు.. నన్నేమై నా చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు!’.. అంటూ బడాయిలు పోయాడు. కానీ, అసలు విషయం ఏంటంటే.. అసలు దొంగ ఇరుక్కుపోవడం చూసి, బయట కాపలా ఉన్న కొసరు దొంగలంతా తమ కారు వదిలేసి మరీ పరారయ్యారు.

ఏడుపులంకించుకున్న దొంగోడు 
వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అతన్ని బయటకి తీయడం పెద్ద సాహసమే అయిపోయింది. బయట ఒక కానిస్టేబుల్‌ నెట్టడం, లోపల ఇద్దరు పోలీసులు లాగడం.. ఈ క్రమంలో మన దొంగ గారు నొప్పితో విలవిల్లాడుతూ, ఏడుస్తూ పెట్టిన కేకలు చుట్టుపక్కల వారికి మాత్రం వినోదాన్ని పంచాయి. ఎట్టకేలకు అతన్ని బయటకు తీసి, సంకెళ్లు వేసి స్టేషన్‌కు తరలించారు. దొంగలు వచ్చిన కారు మీద ’పోలీస్‌’ అని స్టిక్కర్‌ ఉండటం విశేషం. ఇప్పుడు పోలీసులు.. ఆ కారు ఎక్కడిది? ఆ దొంగ వెనుక ఉన్న ముఠా ఎక్కడ? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)