Breaking News

మారిన మోదీ ప్రమాణ స్వీకార తేదీ? ఈ దేశాల అగ్రనేతలకు ఆహ్వానం!

Published on Thu, 06/06/2024 - 15:50

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం మోదీ జూన్‌ 9న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత జూన్‌ 8న మోదీ ప్రమాణ స్వీకార ఉంటుందని వార్తలు వెలువడగా.. తాజాగా ఆ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రానికి మార్చినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

కాగా దేశంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి మోదీనే కావడం విశేషం. మోదీ ప్రమాణ స్వీకారానికి దక్షణాసియా దేశాలకు చెందిన  అగ్ర నేతలు తరలిరానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే హాజరు అయ్యే విషయం ఖరారైంది. ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా రణిల్‌ విక్రమసింఘేను ప్రధాని మోదీ ఆహ్వానించారని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. 

బంగ్లాదేశ్‌ ప్రధాని సైతం శనివారం నాటి కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈవెంట్‌ కోసం ఆమె ఒకరోజు ముందే అంటే శుక్రవారమే ఢిల్లీకి చేరుకోనున్నారు. వీరితోపాటు భూటాన్‌, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహాల్‌ ప్రచండ, భూటాన్‌ షెరింగ్ టోబ్గే, మారిషస్‌ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌లకు కూడా ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలను గెలుచుకుంది. 2014లో 282 సీట్లు, 2019లో 303 చోట్ల విజయ కేతనం ఎగరవేసి సొంతంగా మేజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈసారి ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. కూటమి నేతల మద్దతుతోే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)