మరో ‘థార్’ ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్‌

Published on Sat, 09/27/2025 - 11:40

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ చోటుచేసుకుంటున్న ‘థార్‌’ కారు ప్రమాదాలు అందరికీ దడపుట్టిస్తున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లోగల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం  జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో కారులో ‍ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. హైవే ఎగ్జిట్ నంబర్ 9 సమీపంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  

బలంగా డివైడర్‌ను ఢీకొని..
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు  ‘థార్‌’లో ఏదో పని నిమిత్తమై ఉత్తరప్రదేశ్ నుండి గురుగ్రామ్‌కు వెళుతున్నారు. వేగంగా వెళుతున్న కారును డ్రైవర్‌ అదుపు చేయలేకపోవడంతో అది బలంగా డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మిగిలిన ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నదని  వైద్యులు తెలిపారు.

బైక్‌ను ఢీకొన్న ‘థార్‌’
మహీంద్రా థార్‌ కారుకు సంబంధించిన మరో ప్రమాదం ఇప్పుడు కలకలం రేపుతోంది. గత నెలలో ఢిల్లీలోని మోతీ నగర్‌లో వేగంగా వస్తున్న థార్ కారు ఢీకొనడంతో ఒక బైకర్ మృతిచెందాడు. కారు- ట్రక్కు మధ్యలో బైక్ పూర్తిగా నలిగిపోయినట్లు దృశ్యాలు నాడు వైరల్‌ అయ్యాయి. ‘థార్‌’ విండ్‌షీల్డ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. థార్ డ్రైవర్ అమరీందర్ సింగ్ సోధి ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలి పారిపోయాడు. పోలీసులు వాహనంలో రెండు మద్యం సీసాలను కనుగొన్నారు.

రాష్ట్రపతి భవన్‌ సమీపంలో మరో ప్రమాదం
మరో సంఘటనలో న్యూఢిల్లీలోని చాణక్యపురిలో వేగంగా వస్తున్న థార్ కారు ఢీకొనడంతో ఒక పాదచారి మృతి చెందాడు. ఈ ప్రమాదం రాష్ట్రపతి భవన్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దరిమిలా పాదచారి మృతదేహం నాలుగు గంటల పాటు రోడ్డుపైనే పడి ఉంది. నిందితుడు నిద్రమత్తులో ఉన్నాడని, వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో, ఒక మహిళ మహీంద్రా థార్ కారును కొనుగోలు చేసిన వెంటనే దానిని నడిపేందుకు చేసే ‍ప్రయత్నంలో అది అదుపుతప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)