Breaking News

తంజావూరులో ఉద్రిక్తత.. విజయ్‌ దిష్టిబొమ్మ దగ్ధం

Published on Tue, 08/04/2026 - 12:55

సాక్షి, చెన్నై: తమిళనాడు తంజావూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయనిధి స్టాలిన్‌ అరెస్టును వ్యతిరేకిస్తూ డీఎంకే కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలను చేపడుతున్నారు. తంజావురులో షాపులని మూయిస్తున్నారు. అరెస్టును నిరసిస్తూ సీఎం విజయ్‌ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు యత్నించారు. దీంతో టీవీకే, డీఎంకే కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

కావేరి ఇష్యూ నుంచి టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి ఉదయనిధిని అరెస్టు చేయించారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.డీఎంకే నిరసనలకు పన్నీర్‌ సెల్వం నాయకత్వం వహిస్తున్నారు. అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనననలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.కాగా సీఎం, విజయ్‌  సినీనటి త్రిషపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమిళనాడులో ఉద్రిక్తకర పరిస్తితులు ఏర్పడ్డాయి.

మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ డీఎంకే కేంద్రకార్యాలయానికి చేరుకున్నారు. ఉదయనిధి అరెస్టుపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. తదనంతరం తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు మరికాసేపట్లో విచారించనున్నట్లు సమాచారం.

పార్లమెంటులో చర్చ
కాగా ఉదయనిధి అరెస్టు అంశం ఉదయనిధి అరెస్టుపై పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. తమిళనాడులో భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆ పార్టీ ఎంపీ తిరిచ్చి శివ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయన్నారు. అయితే లా అండ్‌ అర్డర్‌ అనేది రాష్ట్ర పరిధిలోని అంశంమని రాజ్యసభ స్పీకర్‌ బదులిచ్చారు. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)