Breaking News

దెబ్బ మీద దెబ్బ.. భారత్‌ దాడులతో పాక్‌ బెంబేలు

Published on Fri, 05/09/2025 - 14:21

పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్‌ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్‌ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్‌ దాడుల్లో 20 మంది పాక్‌ సైనికులు హతమయ్యారు. ఇదిలా ఉండగా, పాక్‌ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్‌ చేశారు. పాక్‌ పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్‌ పిరికిపంద అంటూ పాక్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్‌ మేజర్, సీనియర్‌ ఎంపీ అయిన తాహిర్‌ ఇక్బాల్‌ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్‌.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.

హెచ్‌క్యూ–9పీ, హెచ్‌క్యూ–9బీఈ, ఎఫ్‌ డీ– 2000, హెచ్‌క్యూ–16ఎఫ్‌ఈ గగనతల రక్షణ వ్యవస్థలపై పాక్‌ ఆధారపడుతోంది. వీటితోపాటే పాతతరం ఎల్‌వై–80, ఎఫ్‌ఎం–90 రకాలూ ఎంతోకొంత పాక్‌కు సాయపడుతున్నాయి. 40 కిలోమీటర్ల స్థాయిలో లక్ష్యాలను ఛేదించడానికి ఎల్‌వై–80ను పాక్‌ వాడుతోంది. మే 7వ తేదీ అర్థరాత్రి దాటాక భారత్‌ చేసిన దాడిలో హెచ్‌క్యూ–16 వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి 2021లో హెచ్‌క్యూ–9పీ దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను దిగుమతి చేసుకుంది. తమ గగనతలంలోకి వచ్చిన శత్రు క్షిపణులను 125 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి నేలమట్టంచేయగలదు. యుద్ధ విమానాలనూ అడ్డుకోగలదు.

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)