Breaking News

వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పండి

Published on Thu, 11/14/2024 - 04:45

ముంబై: దివంగత శివసేన అధినేత బాల్‌ ఠాక్రేకు ఏక్‌నాథ్‌ శిందే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు అజిత్‌ పవార్, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీకి మిలింద్‌ దేవ్‌రా వెన్నుపోటు పొడిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ ముగ్గురు మోసగాళ్లకు మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అక్కడి తెలుగు ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్‌పీ)ల మహావికాస్‌ ఆఘాడీ (ఎంవీఏ)కూటమిని గెలిపించాలని కోరారు. రేవంత్‌ బుధవారం సాయంత్రం ముంబైలో తెలుగు ప్రజలు నివసించే వర్లీ, ధారావి, సైన్‌ కోలివాడల్లో ఎంవీఏ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అధికార మహాయుతి కూటమిపై విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, నిజామాబాద్‌ కోడలైన వర్షా గైక్వాడ్‌ను ధారావి నుంచి భారీ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. ఇక్కడి తెలుగు ప్రజల సమస్యలన్నింటినీ ఎంవీఏ ప్రభుత్వం పరిష్కరించేలా తాను హామీగా ఉంటానని తెలిపారు. కాగా వర్లీ బీడీడీ చాల్స్‌లో నివసించే స్థానిక తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డి రోడ్డు షోకు బ్రహ్మరథం పట్టారు. దీంతో రేవంత్‌రెడ్డి కూడా తాను ముంబైలో కాకుండా నిజామాబాద్, కరీంనగర్‌లో ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. రోడ్డు షోకు ముందు రేవంత్‌రెడ్డి వర్లీ బీడీడీ చాల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ప్రజలు వారి సమస్యలు తెలుపుతూ వినతిపత్రాలు సమరి్పంచారు.  
  

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)