Breaking News

ఓటరు జాబితాలో నా పేరు మిస్సయ్యింది: ఆర్‌జేడీ నేత

Published on Sun, 08/03/2025 - 05:07

పట్నా: ఎన్నికల కమిషన్‌ తాజాగా విడుదల చేసిన బిహార్‌ ఓటరు ముసాయిదా జాబితాలో తన పేరు గల్లంతైందని ప్రతిపక్ష ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. తనకు కేటాయించిన ఎపిక్‌ నంబర్‌ సైతం మారిందన్నారు. ఎపిక్‌ నంబర్‌ ఆధారంగా ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో తన పేరు కోసం సోధించగా ‘నో రికార్డ్స్‌ ఫౌండ్‌’అని సూచిస్తోందని ఆరోపించారు. మా ఏరియాకు వచ్చిన బూత్‌ లెవల్‌ అధికారి తాను నింపి అందజేసిన ఎన్యుమరేషన్‌ ఫారానికి సంబంధించి ఎలాంటి రిసిప్టును ఇవ్వలేదన్నారు. 

ఎన్యు మరేషన్‌ ఫారంలను బూత్‌ లెవల్‌ అధికారి ఇచ్చేటప్పుడు తన ఫొటోను తానే తీసుకున్నానన్నారు. ‘ఇప్పుడు చూడండి.. నా పేరు ఓటరు జాబితాలో నమోదు కాలేదు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. దేశ పౌరుడిగా నేను గుర్తింపు పొందలేదు. మా ఇంట్లో ఉండే హక్కు కూడా లేదు’అని ఆయన చెప్పుకొచ్చారు. తమ వంటి వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల విషయం ఎవరు పట్టించు కుంటారంటూ ఈసీపై ఆయన ధ్వజమెత్తారు. తేజస్వీ వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా ఖండించింది. ‘ఓటరు జాబితాలో ఆయన పేరుంది. గతంలో మాదిరిగా వెటరినరీ కాలేజీలోని బూత్‌లోనే ఆయన పేరుంది. ఇదే సాక్ష్యం.. అంటూ జాబితాలో ఆయన పేరున్న జాబితా ఫొటో స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేసింది.  
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)