Breaking News

పెద్దపండక్కి రూ. 30 వేలు: తేజస్వి యాదవ్

Published on Tue, 11/04/2025 - 11:56

పట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఎన్నికల తేదీలు సమీపిస్తుండటంతో నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే నేపధ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్  బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే తమ పార్టీ ‘మై-బహిన్ మాన్ యోజన’ను ప్రారంభిస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం చివరి రోజున ఓటర్లను ఉద్దేశించి  ఆయన మాట్లాడుతూ, 2026 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ఈ పథకాన్ని అమలు చేస్తామని, దీని కింద మహిళలకు ఒక్కొక్కరికి రూ. 30 వేలు అందిస్తామన్నారు.

తాము అధికారంలోకి వస్తే తమ పార్టీ అమలు చేయబోయే కీలక సంక్షేమ పథకాలను తేజస్వి యాదవ్ వివరించారు. రాష్ట్ర ఉద్యోగుల  పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని, పోలీసు సిబ్బందితో సహా అన్నిశాఖల ప్రభుత్వ సిబ్బందిని వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో నియమించేలా చూస్తామన్నారు. వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే క్వింటాలుకు అదనంగా రూ. 300, గోధుమలకు క్వింటాలుకు రూ. 400 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీహార్‌లో మార్పును ముందుకు నడిపించడంలో మహిళల మద్దతు కీలకమని పేర్కొన్నారు.

ఇటీవల ‘మహాఘట్‌ బంధన్‌’ విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని వివరాల ప్రకారం వారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిసెంబర్ ఒకటి నుండి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఐదేళ్ల పాటు మహిళలకు రూ.30 వేల వార్షిక చెల్లింపును కూడా మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. మకర సంక్రాంతి నాడు ఈ మొత్తాన్ని మహిళల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని తేజస్వి పేర్కొన్నారు. బీహార్‌లోని ప్రతి ఇంటికి కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం  అందిస్తామని తేజస్వి యాదవ్ గతంలో హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడ్దాక 20 నెలల్లోపు బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబం అంటూ ఉండదని తేజస్వి గతంలో పేర్కొన్నారు. తాను పదవీ బాధ్యతలు స్వీకరించాక ముందుగా  క్యాబినెట్ సమావేశంలోనే ఈ ప్రతిపాదనపై సంతకం చేస్తానని అన్నారు.

ఇది కూడా చదవండి: ‘ఇస్కాన్‌’పై ఉగ్ర ముద్ర.. ‘బంగ్లా’లో ఆందోళనలు

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)