Breaking News

ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయకుండా హౌస్‌ అరెస్ట్‌

Published on Sat, 08/01/2026 - 16:06

న్యూఢిల్లీ: రాజకీయ విశ్లేషకుడు తహ్సీన్ పూనావాలా ఈ20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా తాను చేపట్టనున్న నిరసన ర్యాలీ, నిరాహార దీక్షకు ముందు ఢిల్లీ పోలీసులు తనను గృహ నిర్బంధంలో పెట్టారని శనివారం ఆరోపించారు. శుక్రవారం పూనావాలా ఢిల్లీలోని గాంధీ స్మృతి వరకు పాదయాత్ర చేసి, అక్కడ మౌన నిరసనతో పాటు నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.  

పూనావాలా ఇవాళ తన నివాసం బయట పోలీసు సిబ్బంది ఉన్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. తనను ఇంటికే పరిమితం చేశారని ఆరోపిస్తూ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీపై విమర్శలు చేశారు. ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా తనను ఎలా నిర్బంధిస్తారని పూనావాలా ఒక పోలీసు అధికారిని ప్రశ్నిస్తున్నట్లు ఓ వీడియోలో కనిపించారు. “మిత్రులారా, ఢిల్లీ పోలీసులు నన్ను నిర్బంధించారు. ఎలాంటి పత్రాలు లేకుండానే నన్ను గృహ నిర్బంధంలో పెట్టారు” అని ఆయన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

“మహిళా అధికారులు సహా మొత్తం ఢిల్లీ పోలీసు బలగం నన్ను గృహ నిర్బంధంలో పెట్టింది. నితిన్ గడ్కరీ ఇథనాల్‌కు భయపడుతున్నారు. నన్ను గృహ నిర్బంధంలో పెట్టాలని పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని ఢిల్లీ పోలీసు అధికారి నాకు చెప్పారు’’ అని పూనావాలా పేర్కొన్నారు. ఈ20 విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడితే “చట్ట ఉల్లంఘన జరిగే అవకాశం ఉంది” అని పోలీసు అధికారి చెప్పడం ఓ వీడియోలో వినిపించింది.

ఈ20 మిశ్రమ పెట్రోల్‌పై వివాదం
ప్రశ్నపత్రాల లీక్‌లపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత, ఈ20 పెట్రోల్ అంశంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని పూనావాలా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. 80% పెట్రోల్, 20% ఇథనాల్‌తో కూడిన ఈ20 పెట్రోల్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్ష పార్టీలు, వినియోగదారుల సంఘాలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి.

ఈ20కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న పూనావాలా, ఆయన టీమ్ ప్రధానంగా చేస్తున్న డిమాండ్లలో ఒకటి.. 100% పెట్రోల్, ఈ5, ఈ10 ఇంధనాలు కూడా అందుబాటులో ఉండాలి. దీంతో వాహనదారులకు ఆప్షన్‌ ఉంటుంది.

మరోవైపు, గురువారం కేంద్ర మంత్రి గడ్కరీ పార్లమెంట్‌కు తెలిపిన వివరాల ప్రకారం.. 20 శాతం ఇథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్ (ఈ20) వాహనం రకం, వాహనం వయస్సును బట్టి ఇంధన సామర్థ్యాన్ని 2 నుంచి 6 శాతం వరకు తగ్గించవచ్చు. లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో గడ్కరీ మాట్లాడుతూ.. ఈ10 ఇంధనంతో పోల్చితే ఈ20 మెరుగైన, వేగవంతమైన స్పందనను ఇవ్వడంతో సుమారు 30 శాతం తక్కువ కార్బన్ ఉద్గారాలను ఇస్తుందని చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ20 ఈ విధానానికి వ్యతిరేకంగా ఈ నెల నుంచి ప్రచారం చేపడతామని ఇప్పటికే ప్రకటించింది. అదే సమయంలో ఢిల్లీలోని రవాణా సంఘాలు కూడా నిరసన ర్యాలీకి సిద్ధమవుతున్నాయి.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)