Breaking News

లేఆఫ్ అయిన 15 రోజుల్లోనే కొత్త జాబ్‌, టెకీ టిప్స్ వైరల్

Published on Wed, 07/15/2026 - 17:34

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణం‌గా  పలు దిగ్గజ టెక్‌  కంపెనీలు కూడా  వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కంపెనీ పునర్నిర్మాణం, టెక్నాలజీలు అంటూ ఉద్యోగులపై వేటు వేస్తుండటంతో  టెకీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. తాజాగా ఒక ఎంన్‌ఎసీలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న టెకీ, కేవలం 15 రోజుల్లొ తిరిగి ఉ‍ద్యోగాన్ని సంపాదించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ కష్టకాలంలో తాను ఉద్యోగం ఎలా సాధించాడో వివరిస్తూ సదరు ఉద్యోగి రెడ్డిట్ (Reddit) వేదికగా కొన్ని కీలక చిట్కాలను పంచుకోవడం విశేషంగా నిలిచింది.

కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా  ఒక  ఎంఎన్‌సీ కంపెనీ నుండి లేఆఫ్ అయ్యాడు. కేవలం రెండు నెలల క్రితమే చేరిన అతనికి, ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్నాడనే కారణంతో ఎలాంటి పరిహారం కూడా ఇవ్వకుండా జూలై 31 వరకు మాత్రమే సమయం ఇచ్చి తీసేశారు. దీంతో అతను తీవ్ర ఆందోళనలో పడిపోయాడు. ఎందుకంటే ఇటీవల అతని ఇంటి లోన్‌ ఈఎంఐలు మొదలయ్యాయి. దీంతో  ఇది ఎలా కట్టాలో అతనికి అర్థం కాలేదు. మొత్తానికి ఉద్యోగాన్ని సాధించానంటూ  తన అనుభవాలను పంచుకున్నాడు.

ఉద్యోగం సాధించడానికి  చిట్కాలు
లింక్డ్‌ఇన్‌లో ఉద్యోగాలకు అప్లై చేయడంతో పాటు, తన స్నేహితులందరికీ ఫోన్ చేసి కంపెనీలలో రిఫర్ చేయమని కోరాడు. కోల్డ్-అప్రోచ్ (నేరుగా రిక్రూటర్లను సంప్రదించడం) పద్ధతిని కూడా వాడాడు. అన్నింటికంటే రిఫరల్స్ మాత్రమే తనకు బాగా పని చేశాయని పేర్కొన్నాడు. మొత్తం 5 కంపెనీలలో ఇంటర్వ్యూలు రాగా.. 2 కంపెనీలు తిరస్కరించాయి, 3 కంపెనీలలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇందులో పుణె బేస్డ్ స్టార్టప్ ఆఫర్లను తిరస్కరించి, నోయిడాలోని ఒక ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలో వచ్చిన ఉద్యోగాన్ని సంతోషంగా ఒప్పుకున్నాడు.

ఇదీ చదవండి: 18 ఏళ్ల ఎన్‌ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

"ప్రస్తుతం జాబ్ మార్కెట్ చాలా క్రూరంగా ఉంది, భవిష్యత్తులో ఇంకా ఘోరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఉద్యోగం వచ్చినా సరే.. DSA (Data Structures and Algorithms) , సిస్టమ్ డిజైన్ (System Design) ప్రిపరేషన్‌ను ఎప్పుడూ ఆపకండి. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి." అంటూ  టెకీలకు సూచించాడు.

ఇదీ చదవండి: ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్‌

ఈ పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు  ఒక్కసారి లేఆఫ్ అనుభవాన్ని ఎదుర్కొని, ఇంత త్వరగా ఉద్యోగం సాధిస్తే.. ఇకపై జీవితంలో లేఆఫ్స్ అంటే భయం పోతుందని ఒకరు, ఇంత బ్రూటల్‌ మార్కెట్‌లో గొప్ప కమ్‌బ్యాక్‌ అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు ఆఫర్ వచ్చినప్పటికీ ప్రిపరేషన్ ఆపకూడదనే  మాట వంద శాతం నిజం అనిమరికొందరు అతడిని అభినందించారు. 

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)