టీచర్స్‌ స్కామ్‌.. అభిషేక్‌ బెనర్జీపై ప్రశ్నల వర్షం

Published on Mon, 06/15/2026 - 15:45

సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన భారీ అవినీతి స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ లోతైన విచారణ జరుపుతుంది. ఈ అంశంలో  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఈ రోజు (సోమవారం) అధికారులు విచారించారు. కోల్‌కతాలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా నిన్న ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో అధికారులు  అభిషేక్ బెనర్జీని దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు.

మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీలు ,నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాల్లో ఆయన పాత్రపై ఈడీ అభిషేక్ బెనర్జీని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డబ్బుకు బదులుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది. ఈనెట్‌వర్క్ ద్వారా, అర్హులైన అభ్యర్థుల కంటే లంచాలు చెల్లించిన వ్యక్తులకే ప్రాధాన్యత లభించిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.   

స్కామ్ నేపథ్యం

పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా మండలి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రూప్-సి, గ్రూప్-డి సిబ్బందితో పాటు ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ ఉపాధ్యాయుల నియామకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, అర్హత గల అభ్యర్థులను పక్కన పెట్టి, పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని అర్హత లేని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ.
  
అక్రమాల కోసం  OMR షీట్ల తారుమారు చేశారని కొందరు ఖాళీ పేపర్లు వదిలినా వారికి ఉద్యోగాలు వచ్చాయని,  అధికారిక అర్హత లేకపోయినా, అక్రమ మార్గాల్లో వందలాది మందికి నకిలీ సిఫార్సు లేఖల ద్వారా నియామక పత్రాలు అందజేశారు. అర్హులైన అభ్యర్థుల పేర్లను వెనుకకు నెట్టి, లంచాలు ఇచ్చిన వారి పేర్లను మెరిట్ లిస్ట్‌లో పైకి చేర్చారని ఆరోపణలున్నాయి. 

దీంతో ఈ స్కామ్‌పై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ED అరెస్ట్ చేసింది. అర్పితా ముఖర్జీ నివాసాల నుంచి సుమారు రూ. 50 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)