Breaking News

రాత బాగోలేదని వాత.. టీచర్‌ అరెస్ట్‌

Published on Thu, 07/31/2025 - 12:58

ముంబై: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు కర్కశంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది ముంబైలో జరిగిన ఒక ఘటన తెలియజేస్తుంది. మలాడ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ట్యూషన్ టీచర్, ఎనిమిదేళ్ల బాలుని చేతిరాత సరిగా లేదంటూ, అతనిని కఠినంగా శిక్షించింది.ఈ నేపధ్యంలో ఆ ఉపాధ్యాయురాలు అరెస్టయ్యింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోరేగావ్‌లోని ఒక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న బాలుడు మలాడ్‌లోని  ఒక టీచర్‌ ఇంటికి ట్యూషన్‌కు వెళుతుంటాడు. సంఘటన జరిగిన రోజు, ఆ బాలుని సోదరి అతనిని ట్యూషన్‌లో దింపి, వెళ్లిపోయింది. ట్యూషన్‌ ముగిశాక ఆ టీచర్‌ బాలుని ఇంటికి ఫోన్‌ చేసి, పిల్లాడిని తీసుకుని వెళ్లాలని చెప్పింది. దీంతో ఆ బాలుని సోదరి ఆ టీచర్‌ ఇంటికి వచ్చింది. ఆ బాలుడు కన్నీళ్లతో కనిపించేసరికి, ఏం జరిగిందని సోదరి ఆ టీచర్‌ను అడిగింది. పిల్లాడు జరిగిన విషయం చెప్పగా, టీచర్‌ వాటిని తోసిపుచ్చింది.

అయితే ఇంటికి తిరిగి వచ్చిన  ఆ బాలుడు తన చేతిరాత సరిగా లేకపోవడంతో టీచర్ మండుతున్న కొవ్వొత్తితో తన చేతిపై వాత పెట్టిందని ఏడుస్తూ చెప్పాడు. వెంటనే పిల్లాడి తండ్రి అతనిని చికిత్స కోసం కాండివాలిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి  తీసుకువెళ్లాడు. తరువాత కురార్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాలునిపై శారీరక, మానసిక క్రూరత్వానికి పాల్పడిన టీచర్‌పై‌ పోలీసులు  కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి