Breaking News

మరోసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Wed, 02/19/2025 - 13:52

చెన్నై:తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడుకు రావాల్సిన సమగ్రశిక్ష అభియాన్‌ రూ.2190 కోట్ల రూపాయల నిధులు తామేమీ అ‍డుక్కోవడం లేదన్నారు. మీ తండ్రి సొమ్ము అడగడం లేదని ఫైరయ్యారు.

‘మేమేమీ మీ తండ్రి సంపాదించిన సొమ్ము అడగడం లేదు. మాకు హక్కుగా రావాల్సిన నిధులే మేం అడుగుతున్నాం. తమిళనాడు ప్రజలు కట్టే పన్ను డబ్బులనే మేం అడుతున్నాం. బీజేపీ బెదిరింపులకు భయపడేదే లేదు. తమిళనాడుపై హిందీని రుద్దాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని రెండు భాషల పాలసీ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. 

ఫాసిస్టు బీజేపీపై ఈ విషయంలో పోరాడేందుకు ప్రతిపక్షం అన్నాడీఎంకే మాతో కలిసి రావాలి. తమిళనాడు ప్రజలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోంది’అని ఉదయనిధి మండిపడ్డారు. కాగా, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ(ఎన్‌ఈపీ) కింద మూడు భాషల పాలసీని అమలు చేసేదాకా తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్‌ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఇటీవలే స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయనిధి స్పందించారు. గతంలోనూ ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)