Breaking News

విజయ్‌పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు

Published on Tue, 03/03/2026 - 12:37

తమిళనాట తన రాజకీయ ఉజ్వల భవిష్యత్తుకోసం కలలు కంటున్న సూపర్‌ స్టార్‌, రాజకీయ నాయకుడు విజయ్‌ నెత్తిన మరో బాంబు పడింది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందనీ, ఎంత చెప్పినా వినడం లేదని ఆరోపిస్తూ భార్య సంగీత  విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. విజయ్ వద్ద సుమారు పదేళ్లపాటు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సెల్వరాజ్ సెల్వం, ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

సెల్వరాజ్ సెల్వం ఆరోపణలు

2015లో 'పులి' సినిమా షూటింగ్ సమయంలో, ఆహారంలో వెంట్రుక వచ్చిందనే నెపంతో విజయ్ తనపై దాడి చేశారని సెల్వరాజ్  ఆరోపించాడు. తనను కొట్టి, కిందపడిపోతే గుండెలపై తొక్కారని, అయితే మరుసటి రోజు తన కోపాన్ని అసిస్టెంట్‌పై చూపించినందుకు క్షమాపణలు కూడా చెప్పారని  పేర్కొన్నాడు.

అంతేకాదు తన కూతురి పెళ్లికి విజయ్‌ను స్వయంగా పిలిచినా ఆయన రాలేదని, ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదని సెల్వరాజ్ ఆరోపించాడు. అనారోగ్య సమస్యల రీత్యా విజయ్‌ను కలవడానికి ప్రయత్నించినా, ఆయన చుట్టూ ఉన్నవారు తనను దగ్గరకు రానివ్వడం లేదని పేర్కొన్నాడు. అలాగే విజయ్ వద్ద పనిచేసే డ్రైవర్ రాజేంద్రన్ వంటి ఇతరులు తనను శత్రువులా చూసేవారని, విజయ్‌కు తాను వండిన వంటల్లో ఉప్పు కలిపి తనపై చెడ్డ పేరు వచ్చేలా చేసేవారని సెల్వరాజ్ సంచలన విషయాలు వెల్లడించడం నెట్టింట చర్చకు దారి తీసింది.

తినడానికి తిండిలేదు, అప్పుల బాధలు
ప్రస్తుతం తాను తీవ్రమైన పేదరికంలో ఉన్నానని సెల్వరాజ్ వాపోయారు. 'GOAT' షూటింగ్ సమయంలో తనకు గుండెపోటు వచ్చిందని, శస్త్రచికిత్స కోసం 10 లక్షల రూపాయలు అప్పు చేశానని చెప్పారు. రెండేళ్లు అయ్యింది. సహాయం కోసం విజయ్ సర్‌ను కలవడానికి ప్రయత్నించాను, కానీ అతని వాళ్ళు నన్ను అతని దగ్గరికి రానివ్వరు. నేను వేరే చోట పని కోసం అప్పుల బాధతో కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నానని,  కడుపు నిండి తినేందుకు  కూడా ఇబ్బందులు పడుతున్నామని వాపోయాడు. తన భార్య మెడలో పుస్తెల తాడు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పదేళ్ల సర్వీస్ తర్వాత, విజయ్ తండ్రి ,దర్శకుడు చంద్రశేఖర్‌తో అరవై చిత్రాలకుపైగా పనిచేసిన తాను ఈ పరిస్థితిలో ఉంటానని ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.  

ఇదీ చదవండి: విజయ్‌కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు

అయితే సెల్వరాజ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలపై విజయ్ టీమ్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక వివరణ రాలేదు.విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్న పుకార్ల నేపథ్యంలో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తండ్రిని సోషల్ మీడియాలో అన్-ఫాలో చేశారనే వార్తలు కూడా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి : ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులు

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)