పునర్విభజనను సమర్థించేవాళ్లు ద్రోహులే

Published on Sun, 08/02/2026 - 05:59

సాక్షి, చెన్నై: మోదీ ప్రభుత్వం తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌ బిల్లును ఆమోదింపజేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రతి జాతీయ పార్టీ, తమిళ పార్టీ వ్యతిరేకించాలని కోరారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తే ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుందని తేల్చిచెప్పారు. రాహుల్‌ గాంధీ శనివారం తమిళనాడులోని మహాబలిపురంలో మీడియాతో మాట్లాడారు. 

జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులతో మేధోమథన సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. తమిళ ప్రజల ఓటు హక్కును హరించి, వారి నుంచి అధికారాన్ని లాగేసుకునేలా నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను కచ్చితంగా తిప్పికొట్టాలని స్పష్టంచేశారు. పార్లమెంట్‌లో డీమిలిటేషన్‌ బిల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదం పొందకుండా చూడాలన్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజనకు మద్దతు ఇస్తే ప్రజలపై, వారి భవిష్యత్తుపై దాడి చేయడానికి బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. 

క్షమాభిక్ష కాదు.. క్షమాపణ కావాలి  
తమిళనాడులో ‘నీట్‌’పరీక్ష వల్ల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను రాహుల్‌ గాంధీ పరామర్శించారు. కన్నబిడ్డల కోసం తల్లిదండ్రులు దుఃఖించడం చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదని అన్నారు. అవినీతిమయమైన పరీక్షా విధానాన్ని అందించినందుకు విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు మోదీ క్షమాభిక్ష అవసరం లేదని, క్షమాపణ చెప్పడమే కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)