Breaking News

ఫెంగల్‌ తుఫాన్‌ బీభత్సం.. సీఎం స్టాలిన్‌కు ప్రధాని ఫోన్‌

Published on Tue, 12/03/2024 - 12:29

చెన్నై: ఫెంగల్‌ తుఫాన్‌ తమిళనాడులో అపార నష్టాన్ని మిగిల్చింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడులోని విల్లుపురం, సేలం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాలో పెను విలయాన్ని మిగిల్చింది. కుండపోతగా వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ వరదలకు ఊర్లకు ఊర్లో మునిగిపోయాయి.

తాజాగా వరదలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ప్రధానమత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్‌ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితిపై ప్రధాని ఆరా తీశారు.కేంద్రం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఇక ఉత్తర తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు పోతెత్తాయి. వంతెనలు,  రోడ్లు  నీట మునిగాయి. భారీ విస్తీర్ణంలో పంట పొలాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు నీట మునిగి ఉన్నాయి. సాయం కోసం గ్రామీణ జనం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తోపాటుగా మంతరులు బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.

తిరువణ్ణామలై మహా దీపం కొండపై నుంచి మట్టి చరియలు, బండరాళ్లు కొట్టుకు వచ్చి ఆదివారం రాత్రి ఇళ్లపై పడిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఈ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నిచినా.. ఫలితం లేదు. సోమవారం రాత్రి మృతదేహాలుగా వారంతా బయట పడ్డారు.

మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాన్‌ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం అరేబియన్‌ సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)