Breaking News

నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్‌

Published on Fri, 11/07/2025 - 10:33

సమాజంలో, ముఖ్యంగా సినీ సమాజంలో నటీ మణులు, హీరోయిన్లపై, శరీరాలపై అవమానకర (Bodyshaming) వ్యాఖ్యలు పరిపాటిగా మారిపోయాయి. తాజాగా తమిళ నటి గౌరీ కిషన్ (Gouri Kishan) శరీరాన్ని అవమానించేలా ఒక ప్రెస్‌మీట్‌లో  అడిగిన ప్రశ్న ఆగ్రహ జ్వాలల్ని రగిలించింది.  

సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్‌లో తన బరువు గురించి తమిళ యూట్యూబ్ మీడియా జర్నలిస్టు ‘మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు?’ అని  అడిగిన ప్రశ్నకు గౌరీ  కిషన్‌ తీవ్రంగా స్పందించింది. నటిగా నా నటన గురించి అడిగాలి, సినిమా గురించి అడగాలి కానీ, నా శరీర బరువు గురించి అడగడం ఏమిటంటూ ఆమె ఆగ్రహం​ వ్యక్తం చేసింది.  ఇదే ప్రశ్న ఒక పురుష నటుడి బరువు గురించి అడుగుతారా అని కూడా ఆమె ప్రశ్నించింది.  పైగా బరువు గురించి అడిగిన ప్రశ్న కరెక్టే అని ఒక పురుష జర్నలిస్ట్ వాదించడం  దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, ఇది జర్నలిజం కాదు. వేధింపులతో సమానమని పేర్కొంది. జర్నలిస్టులు వృత్తికి అవమానం తెస్తున్నారంటూ సీరియస్‌ అయ్యింది.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద నటికి మద్దతుగా నిలిచారు. మహిళలపై ఆబ్జెక్టిఫికేషన్, బాడీ షేమింగ్‌కు అడ్డుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు.  గౌరీ కిషన్ తన రాబోయే చిత్రం 'అదర్స్' కోసం చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.  చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగికత గురించి చర్చకు దారితీసింది. గౌరీ స్పందనతో అక్కడే వున్న ఆదిత్య మాధవన్ మౌనం కూడా  ఈ చర్చకు ఆజ్యం పోసింది.

క్షమాపణలు కోరిన హీరో
అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరీ సహనటుడు, నటుడు ఆదిత్య మాధవన్‌ దీనిపై  స్పందిస్తూ  అందరికీ క్షమాపణలు చెప్పారు.  తన మౌనం బాడీ షేమ్ చేయడాన్ని ఆమోదించినట్టుకాదనీ, కానీ ఆ సందర్భంలో  స్తంభించి పోవడంతో తన నోట మాట రాలేదంటూ చెప్పుకొచ్చాడు.  అయినా తాను  జోక్యం చేసుకుని ఉండి  ఉంటే బాగుండు అన్నారు.

చిన్మయి స్పందన
గాయని చిన్మయి శ్రీపాద ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్‌  చేశారు."గౌరీ అద్భుతమైన పని చేసింది. అగౌరవకరమైన, అనవసరమైన ప్రశ్న అడిగిన క్షణం, అరుపులు, ఎదురుదెబ్బలు వినిపిస్తాయి. ఇంత చిన్న వయస్సులో ఇంత ధైర్యంగా నిలబడినందుకు చాలా గర్వంగా ఉంది. ఏ పురుష నటుడిని కూడా బరువు గురించి అడగరు అంటూ  ఆమె అసహనం వ్యక్తం చేశారు.

అటు  పలువురు మహిళా జర్నలిస్టులు, పలువురు నెటిజన్లు గౌరీ  ధైర్యాన్ని మెచ్చుకున్నారు. హీరో, దర్శకుడు అక్కడే  ఉండి కూడా  మౌనంగా ఉండటం ఇద్దరికీ సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాగా బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన  గౌరీ కిషన్ తనదైన నటన, ప్రతిభతో హీరోయిన్‌గా రాణిస్తోంది  తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు