Breaking News

భారత్‌కు రాణా తరలింపు!

Published on Thu, 04/10/2025 - 05:59

న్యూఢిల్లీ:  2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, పాకిస్తాన్‌ సంతతి ఉగ్రవాది తహవూర్‌ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాణాను తీసుకొని భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి బుధవారం రాత్రి 7.10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రత్యేక విమానంలో బయలుదేరారు. గురువారం మధ్యాహ్నంకల్లా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రాణాను అధికారికంగా అరెస్టు చేస్తుంది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను తీహార్‌ జైలుకు తరలిస్తారు.

 రాణా భద్రత కోసం జైలులో ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో రాణాపై విచారణ ప్రారంభం కానుంది. కేసు విచారణ ఢిల్లీలోనే జరుగుతుంది కాబట్టి రాణాను ముంబైకి తరలించే అవకాశం లేదని అంటున్నారు. అమెరికా నుంచి రాణా తరలింపు ప్రక్రియను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తనను ఇండియాకు అప్పగించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ రాణా దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే తిరస్కరించింది. దాంతో అతడిని ఇండియాకు అప్పగించేందుకు అవరోధాలు తొలగిపోయాయి. 
 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)