Breaking News

సుశాంత్‌ కేసు.. సుప్రీంకోర్టులో రియా చక్రవర్తికి ఊరట

Published on Fri, 10/25/2024 - 15:59

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటితోపాటు ఆమె కుటుంబంపై సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్‌ సర్క్యూలర్‌ను (ఎల్‌ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈమేరకు బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

ఈ సందర్భంగా  సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ అనవసరమైనదని పేర్కొంది. ‘నిందితుల్లో ఒకరు సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయినందున మీరు ఈ పనికిరాని పిటిషన్‌ వేశారు. మేము మిమ్మల్నిహెచ్చరిస్తున్నాం. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు( సుశాంత్‌, రియా) సమాజంలో పేరు కలిగిన వారు.’ అని పేర్కొంది.

ఇదిలా ఉండగా నటుడు సుశాంత్‌ సింగ్‌  2020 జూన్‌ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అది ఆత్మహత్య కాదని, సుశాంత్‌ మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ పాట్నాలో అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి విచారణ చేపట్టింది. 

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ గతంలో ఎల్‌వోసీ జారీ చేసింది. దీనిపై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ తీర్పు వెలువడింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)