Breaking News

తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

Published on Mon, 09/23/2024 - 10:50

సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సురేష్  ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌లో లడ్డూ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని కోరారు. దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్థించారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు.. తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఒకవేళ సిట్టింగ్‌ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే, విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. తద్వారా వాస్తవాల నిగ్గుతేల్చాలని కోరారు.

ఈ అభ్యర్థనతో తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయనున్నామని, దీనిపై విచారణ జరపాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి విషయంలో వాస్తవాలను తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని.. అందువల్ల నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు.

అందుకోసమే తాము ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాము బుధవారం విచారిస్తామని, ఈలోపు పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్‌కు చురకలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)