Breaking News

లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్‌ రేవణ్ణ సోదరుడు అరెస్ట్‌

Published on Sun, 06/23/2024 - 10:36

బెంగళూరు: ప్రజ్వల్‌ రేవణ్ణ సోదరుడు  జేడీ(ఎస్‌) ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణను లైంగిక వేధింపుల కేసులో హాసన్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. హాసన్‌ జిల్లాలోని హోలెనరసిపుర పోలీసు స్టేషన్‌లో జేడీఎస్‌ కార్యకర్త చేతన్‌.. సూరజ్‌ రేవణ్ణపై లౌంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈమేరకు  పోలీసులు సూరజ్‌ రేవణ్ణను అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని ఆయన తిరస్కరించటంతో  పోలీసులు సూరజ్‌ను బెంగళూరు తీసుకువచ్చారు. ఇవాళ ఆయనకు పొటెన్సీ పరీక్ష నిర్వహించనున్నారు.

తనపై సూరజ్‌ రేవణ్ణ లైంగిక  వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్‌ కార్యకర్త చేతన్‌, మరోవ్యక్తి హోలెనరసిపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘సూరజ్‌ ఫామ్‌ హైజ్‌లో జూన్‌ 16 తేదీన నాపై లైంగికంగా దాడి చేశాడు. బదులుగా నాకు రాజకీయంగా ఎదగటానికి  సాయం చేస్తాననని బలవంతంగా లైంగిక దాడికి దిగాడు.  ఈ ఘటన జరిగిన తర్వాత సూరజ్‌కు మెసెజ్‌ చేస్తే.. ‘ఏం కాదు. అంతా సర్దుకుంటుంది’అని రిప్లై   ఇచ్చాడు’అని కార్యకర్త  చేతన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఫిర్యాదుపై స్పందించిన సూరజ్‌, అతని స్నేహితుడు శివకుమార్‌ తమను బ్లాక్‌మెయిల్‌ చేయడానికే చేతన్‌, మరోవ్యక్తి  అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారని అన్నారు. చేతన్‌ అనే వ్యక్తి  తమతో  స్నేహంగా ఉంటూ  ఉద్యోగం కావాలని కోరితే.. ఉద్యోగం కోసమనే తాను సూరజ్‌ను పరిచయం చేశానని శివకుమార్‌ తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)