Breaking News

సందేశ్‌ఖాలీ ఘర్షణ.. వెస్ట్‌ బెంగాల్‌ సీఎస్‌, డీజీపీలకు ఊరట

Published on Mon, 02/19/2024 - 13:15

న్యూఢిల్లీ: సందేశ్‌ఖాలీ ఘర్షణల అంశంలో తమ ముందు హాజరు కావాలని లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ఇచ్చిన ఆదేశాల నుంచి పశ్చిమ బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ(సీఎస్‌), డీజీపీలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ  ఆదేశాలపై చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌  సోమవారం స్టే ఇచ్చింది.

పశ్చిమబెంగాల్‌ సందేశ్‌ఖాలీలో జరిగిన పరిణామాలపై ఆందోళన చేపట్టిన బీజేపీ ఎంపీలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీనిపై ఎంపీ సుకాంత మజుందార్‌ రాష్ట్ర సీఎస్‌, డీజీపీలపై లోక్‌సభ  ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రివిలేజ్‌ కమిటీ పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌ భగవతి ప్రసాద్‌ గోపాలిక, డీజిపీ రాజీవ్‌కుమార్‌లను సోమవారం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రివిలేజ్‌ కమిటీ దర్యాప్తుపై కోర్టు స్టే ఇచ్చింది.   

కాగా, టీఎంసీ నేత షాజహాన్‌షేక్‌, ఆయన అనుచరులు తమ భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సందేశ్‌ఖాలీ ప్రాంత వాసులు ఇటీవల ఆందోళనలకు దిగారు. దీనిపై బీజేపీ ఎంపీలు సందేశ్‌ఖాలీకి వెళ్లి మహిళలను పరామర్శించడానికి యత్నంచినపుడు పోలీసులకు వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎంపీ సుకాంత గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. ఈ ఉదంతంపై ఆయన లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి.. ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ ఆరో‘సారీ’ 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)