Breaking News

పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట

Published on Tue, 01/21/2025 - 05:47

న్యూఢిల్లీ:  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాందీకి ఊరట లభించింది. ట్రయల్‌ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడుతూ అమిత్‌ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్‌ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 అమిత్‌ షా పరువుకు నష్టం కలిగించేలా రాహుల్‌ మాట్లాడారని ఆరోపించారు. రాహుల్‌పై పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్‌ గాం«దీని రాంచీలోని మెజిస్టీరియల్‌ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన తొలుత జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది.

 దీంతో రాహుల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జార్ఖండ్‌ ప్రభుత్వానికి, బీజేపీ నేత నవీన్‌ ఝాకు నోటీసు జారీ చేసింది. రాహుల్‌ దాఖలు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కింది కోర్టులో రాహుల్‌పై విచారణ నిలిపివేయాలని తేల్చిచెప్పింది. రాహుల్‌ తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ అభిõÙక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు