Breaking News

పాక్‌ వెళ్లిపోవాలన్న కేంద్రం ఆదేశాలపై ఓ కుటుంబానికి సుప్రీంలో ఊరట

Published on Fri, 05/02/2025 - 16:11

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌ జాతీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.. ఇలాంటి పరిస్థితుల్లో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యులున్న అహ్మద్‌ తారిక్‌ బట్‌ కుటుంబం కూడా తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. అయితే, వారు వేసిన పిటిషన్‌పై శుక్రవారం.. వాదనలు విన్న జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌కే సింగ్‌ ధర్మాసనం.. ఆ కుటుంబానికి తాత్కాలిక ఊరటనిచ్చింది. వీసా గడువు ముగిసినా వీరు ఇంకా భారత్‌లోనే ఉన్నట్లు తేలింది. ఆ కుటుంబం కశ్మీర్‌లో ఉండగా.. కుమారుడు బెంగళూరు యాక్సెంచర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తాము భారత జాతీయులమేనని అయినా మమ్మల్ని అరెస్టు చేశారంటూ వాదనలు వినిపించారు. తమ వద్ద అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ ఉన్నాయని కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఈ కుటుంబంలో ఒకరు పాకిస్థాన్‌లో జన్మించినా.. ఆ తర్వాత భారత్‌కు వలసవచ్చి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను సరెండర్‌ చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఈ అంశంలో ధ్రువీకరించాల్సిన అంశాలున్నాయని.. ఈ పిటిషన్‌ దాఖలు చేయడంలోనే లోపాలున్నాయని పేర్కొంది. దీని మెరిట్‌పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా పిటిషన్‌ను కొట్టేస్తున్నామన్న ధర్మాసనం.. అధికారులకు ఓ సూచన చేసింది. ఏ నిర్ణయం తీసుకోబోయే ముందైనా.. వారు చూపుతున్న పత్రాలను ధ్రువీకరించాలని.. ఈ కేసులో ఉన్న కొన్ని విచిత్ర పరిస్థితుల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకొనేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల చర్యలతో సంతృప్తి లేకపోతే పిటిషనర్లు జమ్మూకశ్మీర్‌ హైకోర్టును ఆశ్రయించవచ్చంటూ కూడా ధర్మాసనం సూచించింది.

 


 

 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)