Breaking News

కూల్చివేత బాధితులు కోర్టుకు రావొచ్చు

Published on Fri, 10/25/2024 - 05:55

న్యూఢిల్లీ: బుల్డోజర్‌ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేక్‌ వేసినా.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్‌ అధికారులు దీన్ని ఉల్లంఘించారని, ఈ మూడు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ అభియోగాలు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. పిటిషనర్‌కు కూల్చివేత బాధితుడు కాదని, ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వాటితో ఎలాంటి సంబంధం లేదని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ పి.కె.మిశ్రా, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం పేర్కొంది.

 తేనెతుట్టను కదల్చాలని తాము అనుకోవడం లేదని, కూల్చివేత బాధితులు ఎవరైనా ఉంటే కోర్టుకు రావొచ్చని స్పష్టం చేసింది. నిందితులు అయినంత మాత్రాన వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూల్చవద్దని సుప్రీంకోర్టు బుల్డోజర్‌ న్యాయానికి బ్రేక్‌ వేసిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది. దీనిపై తాముదేశవ్యాప్తంగా అమలయ్యేలా మార్గదర్శకాలు జారీచేస్తామని చెప్పింది. 

అయితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే.. అది గుడి అయినా, మసీదు అయినా కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా కూల్చివేత చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కాన్పూర్, హరిద్వార్, జైపూర్‌లలో అధికారులు కూల్చివేతలకు దిగారని, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషనర్‌ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఒకచోట అయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే కూల్చివేతకు పాల్పడ్డారని తెలిపారు. 

ఫుట్‌పాత్‌ ఆక్రమణనను మాత్రమే తొలగించారని, పిటిషనర్‌కు నేరుగా దీనితో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయనకు వాస్తవాలు తెలియవని ఉత్తరప్రదేశ్‌ తరఫున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ వాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషనర్‌ సుప్రీంకోర్టుకు వచ్చారని అన్నారు. ఈ కూల్చివేతలతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి... పిటిషన్‌ను అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పైన పేర్కొన్న మూడు ఘటనల్లో ఇద్దరు జైళ్లో ఉన్నారని పిటిషనర్‌ తెలుపగా.. వారి కుటుంబీకులు కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం బదులిచి్చంది.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)