Breaking News

మెడికల్‌ బోర్డు చీఫ్‌పై సుప్రీం ఆగ్రహం

Published on Tue, 05/14/2024 - 14:29

ఢిల్లీ: ఇండియన్ మెడికల్‌ అసోషియేషన్‌(IMA) అధ్యక్షుడు డా. ఆర్‌వీ అశోకన్‌ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తప్పు పట్టింది.  భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో తాము అందిరికంటే ముందు ఉంటామని మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.

పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యవహరిస్తున్న తీరుపై ఓ ఇంటర్వ్యూలో అశోకన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ అమానుల్లా బెంచ్‌  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే పతంజలి నకిలీ ప్రకటనల కేసులో అశోకన్‌ పిటిషన్‌గా ఉన్నారని  గుర్తుచేసింది.

‘మీ (అశోకన్‌) నుంచి మరింత బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు ఆశించాం.కోర్టు తీర్పుకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలా హఠాత్తుగా మారటానికి కారణం ఏంటీ?’అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

ఈ విషయంలో సుప్రీం కోర్టుకు అశోకన్‌ క్షమాపణలు తెలియజేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలపై మీ క్షమాపణలను ఒకవేళ కోర్టు అంగీకరిస్తే.. మిమ్మల్ని కించపరిచారని కోర్టు ఆశ్రయించారు. అలాంటప్పుడు మీకు ఎలాంటి పరీక్ష పెట్టాలి?’ అని కోర్టు నిలదీసింది. క్షమాపణల అఫిడవిట్‌పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బహిరంగంగా ఎందుకు క్షమాపణలు చెప్పలేదని ప్రశ్నించింది. ‘మీరు నిజంగా క్షమాపణలు చెప్పాలనుకుంటే మీ అఫిడవిట్‌ను ఎందుకు సరిదిద్దుకోలేదు? ఇంటర్వ్యూ అనంతరం మిమ్మల్ని మీరు  ఏవింధంగా సరిదిద్దుకున్నారో చెప్పండి’అని ధర్మాసనం ప్రశ్నించింది.

‘భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో మేము ముందుంటాము. కానీ  స్వీయ నియంత్రణ ఉండాల్సిన సందర్భాలు ఉంటాయి. మీకు నియంత్రణ ఉన్నట్లు  ఆ ఇంట ఇంటర్వ్యూలో మాకు కనిపించలేదు’అని జస్టిస్‌ హిమకోహ్లి అన్నారు. ‘న్యాయమూర్తులుగా మేము విమర్శలు ఎదుర్కొంటున్నా. మేము స్పందించము. ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా అహం ఉండదు. మేము ఉన్నతస్థానంలో ఉన్నాం. మేము చర్యలు తీసుకోవడానికి అర్హులం. చాలా అరుదుగా మాత్రమే చర్యలు తీసుకుంటాం’అని జస్టిస్‌ అమానుల్లా అ‍న్నారు. 

‘మీరు ఇలాంటి వ్యాఖ్యలతో కోర్టు గురించి ఏమి చెప్పలేరు. ఇలాంటి వ్యాఖ్యలే మీపైనే చేస్తే ఏం చేసేవారు’అని కోర్టు ప్రశ్నించింది. అశోకన్‌ సమర్పించిన అఫిడవిట్‌ను చాలా చిన్న, ఆలస్యంతో కూడినదిగా కోర్టు పేర్కొంది.

ఈ విషయంలో ఉరట కల్పించాలని అశోకన్‌ తరుఫు న్యాయవాది కోరగా జస్టిస్‌ కోహ్లి స్పందింస్తూ. మీరు ప్రతిదీ చెప్పడానికి లేదు. అశోకన్‌ ట్రాప్‌లో చిక్కుకున్నారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఈ కేసుపై విచారణను సుప్రీం కోర్టు జూలై  9వ తేదీకి వాయిదా వేసింది. ఇక.. పతంజలి నకిలీ ప్రకటనల కేసు విషయంలో  బాబా రాందేవ్‌, బాలకృష్ణ ఇప్పటికే  రెండుసార్లు క్షమాపణలు తెలిపినా కోర్టు తిరస్కరించింది.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)