Breaking News

ఆ అధికారం ఉందా?.. జమ్ము విభజనపై సుప్రీం

Published on Wed, 08/30/2023 - 09:09

ఢిల్లీ: ఉగ్రవాదం, వేర్పాటువాదం లాంటివి కేవలం జమ్ము కశ్మీర్‌కే పరిమితం కాలేదు. పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాలు ఆ తరహా పీడిత రాష్ట్రాలేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌ 370 రద్దు పిటిషన్‌లపై విచారణ సందర్భంగా.. జమ్ము కశ్మీర్‌ విభజనపై చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది.  

‘‘జమ్ము కశ్మీర్‌ను 2019లో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లే.. ఇరత రాష్ట్రాలనూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించే అధికారం పార్లమెంట్‌కు, కేంద్రానికి ఉంటుందా?’’ అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి కేంద్రం తరపున వాదనలు వినిపించిన సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా  వివరణ ఇవ్వగా.. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ జోక్యం చేసుకున్నారు. 

జమ్ము కశ్మీర్‌లోనే కాదు.. పంజాబ్‌,  ఈశాన్య రాష్ట్రా‍ల్లోనూ జమ్ము తరహా పరిస్థితులు చూస్తున్నాం కదా అని  అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్‌ గవాయి సైతం మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్లను ప్రశ్నించారు. కేవలం సరిహద్దు రాష్ట్రం గనుకే ప్రత్యేకంగా భావించాం గనుకే విభజించాం అనే సమాధానం ఇవ్వకండి అంటూ జస్టిస్‌ కౌల్‌ అసహనం ప్రదర్శించారాయన. 

అయితే.. దశాబ్దాల కాలం నుంచి జమ్ము ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటోందని. పైగా పీవోకేతో సరిహద్దు పంచుకుంటోందని, జమ్ము విషయంలో కేంద్రం తొందరపాటు ప్రదర్శించలేదు. విధానాల పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకుందని. ఒకవేళ గుజరాతో, మధ్యప్రదేశ్‌లను విభజించాల్సి వస్తే.. అప్పుడు ప్రామాణికాలు వేరుగా ఉంటాయని సాలిసిటర్‌ జనరల్‌ బెంచ్‌కు వివరించారు. 

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కలగజేసుకుని..  ‘‘ఒక రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అంగీకరించిన తర్వాత.. ఆ అధికార దుర్వినియోగం చేయకుండా ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేంద్రానికో.. లేదంటే పార్లమెంట్‌కో.. ఇప్పుడున్న ప్రతీ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగానో.. విభజన చేయగల అధికారమో ఉందా? అని ప్రశ్నించారు. 

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 విషయంలో రాజ్యాంగ పరిషత్(పార్లమెంట్‌) పాత్ర కేవలం సిఫార్సు పాత్రను కలిగి ఉంటుంది. అలాగని అది రాష్ట్రపతి అధికారాలను భర్తీ చేసేదిగా ఉండకూడదు అని రాజ్యంగ ధర్మాసనం ‍ స్పష్టం చేసింది. 

ఇక.. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోరగా.. సెప్టెంబర్‌ 1వ తేదీన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని కేంద్రం, కోర్టుకు తెలియజేసింది.

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం అప్పట్లో పేర్కొంది.

కేంద్ర పాలిత ప్రాంతం అనేది శాశ్వతం కాదు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)