జంతర్‌ మంతర్‌ లాఠీఛార్జిపై సీజేఐ సీరియస్‌

Published on Tue, 07/28/2026 - 12:04

సాక్షి, న్యూఢిల్లీ: జంతర్‌ మంతర్‌ వద్ద నీట్‌ నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆందోళనకారులపై లాఠీచార్జ్‌, పెల్లెట్‌ గన్స్‌ వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన అత్యున్నత న్యాయస్థానం.. ఇలాంటి ఘటనల్లో బాధ్యతను నిర్ధారించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది.

“ఎవరు అతిగా బలప్రయోగం చేశారో తేల్చాలి. తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేస్తుంది. బాధ్యతను నిర్ణయించకుండా చేసే దర్యాప్తునకు అర్థం లేదు” అని మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు.

నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది
ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని సుప్రీంకోర్టు సీజేపీ ధర్మాసనం గుర్తు చేసింది. ఆందోళనలను ఎదుర్కొనే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధానాల్లో మార్పులు అవసరమని పేర్కొంది. పోలీసులు గతంలో కోర్టులు సూచించిన మార్గదర్శకాలను పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. నిరసనల సమయంలో పోలీసుల వ్యవహారశైలికి సంబంధించి కొత్త ప్రొటోకాల్‌ అవసరమని సూచించింది. 2018లో ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. టియర్‌ గ్యాస్‌, లాఠీచార్జి, నియంత్ర పద్ధతులపై సమగ్ర విధానం రూపొందించాలి అని పేర్కొంది. 

జులై 20న ఉద్రిక్తతలు
జులై 20న జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంట్‌ వైపు ర్యాలీగా(చలో సంసద్‌) వెళ్లేందుకు CJP నేతృత్వంలో నిరసనకారులు ప్రయత్నించిన సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీలు ఉపయోగించారు. ఈ క్రమంలో ఘర్షణలు చోటుచేసుకుని పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెల్లెట్‌ గన్స్‌ వాడకంపై ఆగ్రహం
పోలీసుల దాడిలో ఓ యువకుడు కంటి చూపు కోల్పోయిన ఘటనను పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మహిళలు, చిన్నారులపై కూడా లాఠీచార్జి జరిగిందని.. యూనిఫాంలో లేకుండా సివిల్‌ డ్రెసులో ఉన్నవాళ్లూ దాడులు చేశారని.. ఎలక్ట్రిక​ బ్యాటన్లు, ఎలక్ట్రిక్‌ షీల్డ్‌లు వాడారని తెలిపారు. ఆందోళనకారులపై పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగించడంపై సీజేఐ సూర్యకాంత్‌ తీవ్రంగా స్పందించారు. పోలీసుల చర్యల్లో అతిగా బలప్రయోగం జరిగిందా? అనే అంశంపై పూర్తి స్థాయి విచారణ అవసరమని తెలిపారు. 

మాజీ న్యాయమూర్తితో సిట్‌ ఏర్పాటు?
ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం అని సుప్రీంకోర్టు పేర్కొంది. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించింది. జంతర్‌ మంతర్‌ ఘటనలో ఎవరి తప్పు ఎంత ఉందో బయటకు రావాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 

పోలీసులకు కీలక సందేశం
నిరసనలు, ఆందోళనలు ప్రజాస్వామ్యంలో భాగమని గుర్తు చేసిన సుప్రీంకోర్టు.. వాటిని నియంత్రించే క్రమంలో పోలీసులు చట్టపరమైన పరిమితులు దాటకూడదని సూచించింది. జంతర్‌ మంతర్‌ ఘటనపై సుప్రీం వ్యాఖ్యలు.. నిరసనల నిర్వహణ, పోలీసుల వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి.

Videos

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)