Breaking News

డిజిటల్‌ అరెస్ట్‌లపై దేశంలో ఎక్కడైనా సీబీఐ దర్యాప్తు చేయొచ్చు! 

Published on Sat, 07/25/2026 - 04:30

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా నేరాలు దేశంలో ఎక్కడ వెలుగు చూసినా దర్యాప్తు చేపట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి పూర్తి అధికారాలు కల్పించింది. అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి నిలువునా దోచుకుంటున్న ఈ సైబర్‌ నేరాలను వ్యవస్థీకృత నేరంగా అత్యున్నత న్యాయస్థానం అభివరి్ణంచింది. హరియాణాకు చెందిన 73 ఏళ్ల వద్ధురాలిని నకిలీ ఆదేశాలతో భయపెట్టి రూ.కోటి మేర దోచుకున్న ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే.

 విచారణలో భాగంగా శుక్రవార న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్, స్కైప్, ఇతర ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ దర్యాప్తు సంస్థలు నోటీసులు, సమన్లు జారీ చేయరాదని స్పష్టం చేసింది. భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) సెక్షన్‌ 35 ప్రకారం నోటీసులను భౌతికంగానే అందజేయాలని తేలి్చచెప్పింది. ద ర్యాప్తునకు ఆటంకాలు లేకుండా అన్ని రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ (డీఎస్పీఈ) చట్టం–1946 కింద సీబీఐకి అనుమతులు ఇవ్వాల ని ఆదేశించింది. సైబర్‌ నేరగాళ్లు కొల్లగొడుతున్న సొమ్మును గుర్తించేందుకు ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెరి్నంగ్‌ టూల్స్‌ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రిజర్వు బ్యాంక్‌కు సూచించింది. 

ఏకంగా మూడు వేల కోట్లు కొట్టేశారు
డిజిటల్‌ అరెస్ట్‌ పేరిట జరుగుతున్న మోసాల తీవ్రతను గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024లో ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో 1.23 లక్షల డిజిటల్‌ అరెస్ట్‌ ఫిర్యాదులు నమోదయ్యాయి. కేవలం ఆ ఒక్క ఏడాదే బాధితుల నుంచి రూ.1,935 కోట్లను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. 2025 మొదటి రెండు నెలల్లోనే కొత్తగా 17,718 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటివరకు మొత్తంగా సుమారు రూ.3,000 కోట్ల మేర సీనియర్‌ సిటిజన్లు, ఇతర సామాన్యుల నుంచి నేరగాళ్లు లాగేసినట్లు అంచనా. 

మన దేశ చట్టాల్లో గుర్తింపు లేదు
డిజిటల్‌ అరెస్ట్‌ అనే పదానికి దేశ చట్టాల్లో ఎలాంటి గుర్తింపూ లేదని న్యాయస్థానం తెలిపింది. వీడియో కాల్స్‌ ద్వారా అరెస్ట్, విచారణల పేరుతో బెదిరింపులకు గురిచేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 21 కల్పిస్తున్న వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఇవి కేవలం ఆర్థిక నేరాలు మాత్రమే కాదని, అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న వ్యవస్థీకృత నేరాలని స్పష్టం చేసింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) లోని సెక్షన్‌ 111 కింద సైబర్‌ నేరాలపై కేసులు నమోదు చేయాలని సూచించింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్‌) అధికార పరిధి సమస్యలు తలెత్తకుండా ‘మకోకా’లాంటి కఠినమైన చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.

మోసం సాగుతోందిలా... 
పోలీసులు, సీబీఐ, ఈడీ, కస్టమ్స్‌ అధికారుల పేరుతో నేరగాళ్లు బాధితులకు వీడియో కాల్స్‌ చేస్తారు. నకిలీ యూనిఫాంలు, ఐడీ కార్డులు, సెట్టింగులతో నమ్మిస్తారు. డ్రగ్స్‌ పార్శిల్, మనీ లాండరింగ్‌ లాంటి తీవ్రమైన నేరాల్లో ఇరుక్కున్నారని భయపెడతారు. ఎవ్వరితోనూ మాట్లాడనివ్వకుండా రోజుల తరబడి వీడియో కాల్‌లోనే ఉంచుతూ మానసికంగా వేధిస్తారు. దీన్నే డిజిటల్‌ అరెస్ట్‌ అంటారు. కేసు నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్‌ లేదా సెక్యూరిటీ డిపాజిట్‌ కింద డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తారు. భయపడిన బాధితులు అడిగినంత డబ్బు పంపగానే నేరగాళ్లు అదృశ్యమవుతారు. వాస్తవానికి వీడియో కాల్స్‌ ద్వారా ఎవరినీ అరెస్ట్‌ చేయరనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)