Breaking News

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. ‘పహల్గాం’ దాడిని ప్రస్తావించిన సుప్రీంకోర్టు

Published on Thu, 08/14/2025 - 12:23

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది అంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇటీవల పహల్గాంలో జరిగిన దాడిని ప్రస్తావించింది.

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని నొక్కి చెప్పింది. ఇటీవల పహల్గాంలో జరిగి దుర్ఘటనను విస్మరించలేమని వ్యాఖ్యానించింది. అనంతరం, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న పిటిషన్‌పై ఎనిమిది వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ గతేడాది విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్, సామాజిక-రాజకీయ కార్యకర్త ఖుర్షాయిద్ అహ్మద్ మాలిక్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో మరింత ఆలస్యం జరిగితే జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది భారత రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన సమాఖ్య సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. జమ్ముకశ్మీర్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు, భద్రతాపరమైన సమస్యలు లేకుండా ఎన్నికల జరిగాయి. రాష్ట్ర హోదా కల్పించకపోవడంతో అభివృద్ధికి అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను ప్రభావితం చేసింది అని పేర్కొన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి