Breaking News

వాంగ్‌చుక్‌ అరెస్ట్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసు

Published on Tue, 10/07/2025 - 06:35

న్యూఢిల్లీ: లద్దాఖ్‌కు చెందిన ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంతోపాటు లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతం యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ)కింద అరెస్ట్‌ చేసిన వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై జస్టిస్‌ అరవింద్‌ కుమార్, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది. 

వాంగ్‌చుక్‌ అరెస్ట్‌కు కారణాలు తెలిపాలని ఆయన భార్య గీతాంజలి కోరుతున్నారని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ ధర్మాసనానికి నివేదించారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జోక్యం చేసుకుని, ఇప్పటికే వాంగ్‌చుక్‌కు ఈ మేరకు అధికారులు వివరాలు అందజేసినట్లు వివరించారు. నిర్బంధానికిగల కారణాలను భార్యకు తెలపాలనే నిబంధనేదీ లేదని కూడా ఆయన చెప్పారు. అయితే, ఈ సమయంలో తామేమీ చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది. అరెస్ట్‌కు కారణాలను తెలిపే విషయం పరిశీలించాలని సొలిసిటర్‌ జనరల్‌ను కోరింది. 

అదే సమయంలో, వాంగ్‌చుక్‌ వైద్య అవసరాలను జైలు నిబంధనలకు లోబడి తీర్చాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో రెండు రోజులపాటు కొనసాగిన ఆందోళనల్లో నలుగురు చనిపోగా 90 మంది గాయపడ్డారు. హింసకు వాంగ్‌చుక్‌ ప్రేరేపించారంటూ అధికారులు సెప్టెంబర్‌ 26న అదుపులోకి తీసుకుని, ఆ వెంటనే రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఎన్‌ఎస్‌ఏ కింద అరెస్టయితే గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు.  

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)