Breaking News

సీఈసీ, ఈసీలకు రక్షణ ఎందుకు?

Published on Wed, 11/04/2026 - 17:21

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ)కు వారి అధికారిక విధులపై పూర్తిస్థాయి జీవితకాల న్యాయపరమైన రక్షణ (బ్లాంకెట్‌ ఇమ్యూనిటీ) కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై(పిల్‌) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

 ‘చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ యాక్ట్‌–2023’లోని సెక్షన్‌ 16 సెక్షన్‌ రాజ్యాంగబద్ధత అంశం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. సెక్షన్‌ 16ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది, సామాజిక కార్యకర్త అరుణ్‌ కుమార్‌ అగర్వాల్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా పిటిషన్లు దాఖలు చేశారు. అగర్వాల్‌ తరఫున నేహా రాఠీ, మనోజ్‌ ఝా తరఫున ఫౌజియా షకీల్‌ వాదనలు వినిపించారు. అధికారిక విధుల్లో ఎన్నికల కమిషనర్లు చేసే వ్యాఖ్యలు, నిర్ణయాలపై ఎటువంటి సివిల్‌ లేదా క్రిమినల్‌ విచారణలు చేపట్టరాదనే సెక్షన్‌ 16 నిబంధన ఏకపక్షంగా ఉందని వాదించారు.

 సద్భావనతో చేయని పనులకు లేదా పరిధి దాటి చేసే చర్యలకు కూడా పూర్తి మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. సీఈసీకి ఉన్న ఈ నిరంకుశ రక్షణ వల్ల ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన ఓటర్లకు, బాధితులకు న్యాయం పొందే హక్కు లేకుండా పోతోందని చెప్పారు. ఎన్నికల సంఘం స్వతంత్రత పేరిట అందులోని సభ్యులు న్యాయపరమైన జవాబుదారీతనం లేకుండా పనిచేయడం సమర్థనీయం కాదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే తరహా అంశంపై పెండింగ్‌లో ఉన్న మరో పిటిషన్‌తో దీన్ని జత చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. 

ఎస్‌ఐఆర్‌పై తీవ్ర అసహనం 
ఎన్నికల సంఘం చేపట్టిన ఒటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)పై దాఖలైన ఇతర పిటిషన్లను సైతం ధర్మాసనం విచారించింది. ఎన్నికల సంఘం పనితీరుపై న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఢిల్లీలో ఇప్పుడు ఎన్నికలే లేనప్పుడు ఎస్‌ఐఆర్‌ను ఇంత హడావుడిగా ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని నిలదీశారు. ఎస్‌ఐఆర్‌ అనేది ఓటర్లను ఇబ్బంది పెట్టేందుకు, భయపెట్టేందుకు ఉద్దేశించినట్లుగా కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. 

ఇప్పటికే రిజిస్టర్‌ అయిన ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్‌ జాబితాలో లేకపోతే, మళ్లీ కొత్తగా ఫారం–6 ఎందుకు సమర్పించాలని జస్టిస్‌ బాగ్చీ ప్రశ్నించారు. ఓటరు ఏమరుపాటుగా ఉంటే, శిక్షగా వారి ఓటుహక్కును శాశ్వతంగా లాగేసుకుంటారా? అని ఆక్షేపించారు. ఎస్‌ఐఆర్‌ విషయంలో విధించిన గడువులపై మొండిపట్టు వీడి, ఎన్యూమరేషన్‌ ఫారాలను ఆలస్యంగా సమర్పించే అవకాశాన్ని పౌరులకు కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తొలగించిన ఓటర్ల వివరాలను స్థానిక భాషల్లో గ్రామ, మండల స్థాయిలో జాబితా రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని తేల్చిచెప్పింది.

ఓటర్లకుభరోసా
ఎస్‌ఐఆర్‌ వ్యవహారం కోర్టు పరిశీలనలో ఉన్నందున ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని ధర్మాసనం భరోసా ఇచ్చింది. ఎస్‌ఐఆర్‌ ద్వారా పేరు తొలగించినా, గడువు ముగిసినా నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్ల జాబితాలో న మోదు చేసుకునే హక్కు పౌరులకు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం డిసెంబర్‌ 19కి వాయిదా వేసింది.  

ఇదీ చదవండి : సడన్ ట్విస్ట్.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఈవెంట్స్ క్యాన్సల్!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)