Breaking News

రాష్ట్రాలకు సుప్రీం కోర్టు హెచ్చరిక

Published on Tue, 01/13/2026 - 15:08

ఢిల్లీ సాక్షి: దేశవ్యాప్తంగా వీదికుక్కల బెడద తీవ్రమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు వీధి కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే కఠిన చర్యలు విధిస్తామని ప్రకటించింది. శునకాలు కరవడం వల్ల పిల్లలు లేదా పెద్దలు ఎటువంటి ప్రమాదానికి గురైనా దాని సంబంధించి రాష్ట్రాలే  పరిహారం చెల్లించేలా ఆదేశిస్తామని హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరగడంతో ప్రజలలో రేబీస్‌తో పాటు ఇతర ప్రమాదకర వ్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, క్రీడా సముదాయాలు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాగ్ షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించింది. అయితే  తాజాగా ఈ కుక్కల బెడద కేసును సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్‌నాధ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌.వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు( మంగళవారం) మరోసారి విచారించింది.

ఈ నేపథ్యంలో జస్టిస్ విక్రమ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు "వీధి కుక్కల బెడద నివారణకు రాష్ట్రాలు సరైన చర్యలు తీసుకోకుంటే పెద్దలను, పిల్లలను కుక్కలు కరిస్తే అధిక మెుత్తంలో రాష్ట్రాలు  పరిహారం చెల్లించేలా ఆదేశిస్తాం. అదేవిధంగా కుక్కలకు పుడ్‌ పెట్టేవారు వారి ఇంట్లోని వాటిని పెంచుకొని అక్కడే వాటికి తిండిపెట్టండి". అని జస్టిస్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. జంతు ప్రేమికులము అని చెప్పుకునే సంస్థలు తొమ్మిదేళ్ల బాలుడిపై శునకాలు దాడి చేసినప్పుడు ఏందుకు బాధ్యత తీసుకోలేదు అని జస్టిస్ ప్రశ్నించారు.

అదే విధంగా కుక్కలకు ఆహారం ఇచ్చేవారిపై వేదింపులకు గురవుతున్నాయి అని వచ్చిన పిటిషన్‌ను తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అది శాంతిభద్రతల సమస్యని అలా వేధింపులకు గురైన వారు వ్యక్తిగతంగా కేసు నమోదు చేసుకోవాలని సూచించింది. వీధుల్లోని అన్ని కుక్కలను తొలగించాలని తామెప్పుడూ ఆదేశించలేదని యనిమల్ బర్త్ రూల్ ప్రకారం చికిత్స కాని వాటిని షెల్టర్లకు తరలించాలని తెలిపినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?