Breaking News

తప్పుడు ఫిర్యాదులపై సుప్రీం సీరియస్‌ 

Published on Fri, 02/27/2026 - 03:43

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు తప్పుడు ఫిర్యాదులు, కట్టుకథల సాక్ష్యాలు నమోదు అవుతున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుడు కేసులను ఎదుర్కొంటున్న వారిని కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఉద్ఘాటించారు. కొన్ని సందర్భాల్లో కేసు నమోదు అయిన విషయం ఫిర్యాదు దారుడికి కూడా తెలియడం లేదన్నారు.

 తప్పుడు ఫిర్యాదులు, కట్టుకథల సాక్ష్యాలు, దురుద్దేశపూర్వకంగా నమోదు చేసే క్రిమినల్‌ కేసులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ సీనియర్‌ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ వేసిన పిల్‌పై గురువారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ పంచోలీల ధర్మాసనం విచారణ చేపట్టింది. తప్పుడు కేసుల వివరాలను తెలపాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.  

నిరపరాధుల జీవితాన్ని రక్షించాలి 
ఆరి్టకల్‌ 32 కింద దాఖలైన ఈ పిల్‌లో అంశాలు ఇలా ఉన్నాయి. ‘తప్పుడు కేసులను అరికట్టేందుకు పరిపాలనా భద్రత చర్యలు తీసుకోవాలి. నిరపరాధుల జీవితం, స్వేచ్ఛ, గౌరవాలను రక్షించాలి. నిజమైన కేసుల కంటే తప్పుడు కేసుల వల్లనే న్యాయవ్యవస్థపై భారం పడుతోంది. భూ వివాదాలు వంటి సివిల్‌ కేసులు కొన్ని సందర్భాల్లో.. ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద క్రిమినల్‌ కేసులవుతున్నా యి. ఫలితంగా గ్రామీణ వాతావరణం ఇబ్బ ందికరంగా ఉంటోంది’అంటూ సీనియర్‌ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ పేర్కొన్నారు. రోజూ దేశంలో తప్పుడు కేసులు వందల సంఖ్యలో నమోదు అవుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థలపై ఉందని ఆమె పేర్కొన్నారు.  

విమర్శలకు భయపడం 
నిరపరాధులను రక్షించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. ‘కోర్టు ఈ అంశంపై ఆదేశాలు ఇస్తే.. ప్రజల హక్కులను అణచివేస్తున్నారనే ఆరోపణలు రావొచ్చనే విషయాన్ని కూడా మేం గమనించాం’అని పేర్కొన్నారు. అయినప్పటికీ.. తాము ఎవరో చేసే విమర్శలకు భయపడమని స్పష్టం చేశారు. ‘మమ్మల్ని గ్యాగ్‌ చేస్తున్నారని అంటున్నారు, అలా చేస్తున్నారని మేం భయంతో ఉండాలా?’అంటూ ప్రశ్నించారు. 

కొందరు దురి్వనియోగం చేసి మాయవుతామంటే ఎలా అని పేర్కొన్నారు. ‘ఇటువంటి కేసుల విషయంలో సమాజం అవగాహనతో ఉండాలి, పక్కవారి మౌలిక హక్కుల గురించి కూడా తెలుసుకోవాలి, సోదరభావం పెంపొందించాలి’అంటూ సీజేఐ చెప్పారు. విమర్శల కారణంగా న్యాయవ్యవస్థ దుర్వినియోగాన్ని పట్టించుకోకుండా ఉండబోమని ఈసందర్భంగా స్పష్టం చేశారు.
  
కేంద్ర, రాష్ట్రాలకు సూచనలు విచారణ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ‘పోలీసు స్టేషన్‌లు, కోర్టు ప్రాంగణాలు, పంచాయతీ కార్యాలయాలు, విద్యాసంస్థల వద్ద తప్పుడు కేసులపై శిక్షలకు సంబంధించిన వివరాలతో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు సమయంలో ఆరోపణలు నిజమని అఫడవిట్‌ లేదా లిఖితపూర్వక హామీ తీసుకోవాలి. 

తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు సమాచారంపై ఉన్న చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. బీఎన్‌ఎస్‌–2023లోని సంబంధిత నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వాలి. పిటిషన్‌ ప్రకారం చట్టాల్లో శిక్షల నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటి దురి్వనియోగాన్ని నిరోధించే పరిపాలనా వ్యవస్థ లోపించడం వల్ల సమస్య కొనసాగుతోంది, దీనిని పరిష్కరించేందుకు సిద్దపడాలి’అంటూ నోటీసుల్లో పేర్కొంది. కేంద్రం, రాష్ట్రాల నుంచి స్పందన వచ్చిన తర్వాత ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.  

ఫిర్యాదుదారుడికే తెలియకుండా కేసు? 
కొన్నిసార్లు అసలు ఫిర్యాదు దారుడికి కూడా తెలియకుండా నకిలీ సంతకాలతో కేసులు నమోదవ్వడం అత్యంత దుర్మార్గమని సీజేఐ సూర్యకాంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పేద వ్యక్తికి తన పేరుతో కేసు నమోదైందన్న విషయం కూడా తెలియదు. డబ్బు, అధికార ప్రభావంతో దుర్వినియోగం జరుగుతోంది’అంటూ మండిపడ్డారు. ‘ఇటీవల ఓ మహిళ స్వయాన కోర్టుకు వచ్చి ఒక రాజకీయ నాయకుడు తమ కేసులో భాగస్వామి కాదు’’అంటూ చెప్పింది. ఇలాంటి వ్యవహారాలు డబ్బు లేదా శక్తి ప్రభావం లేకుండా జరుగుతాయా?’అంటూ సీజేఐ ప్రశ్నలు సంధించారు. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)