Breaking News

సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి ఎదురు దెబ్బ

Published on Mon, 09/09/2024 - 13:05

న్యూఢిల్లీ :  ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్‌ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.  

టీచర్‌ రిక్రూట్‌మెంట్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్‌ చేస్తూ అభిషేక్ బెనర్జీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం (సెప్టెంబర్‌9)న సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ తీరును సమర్థించింది. అభిషేక్‌ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది

అభిషేక్‌ బెనర్జీ దంపతులపై ఈడీ కేసు 
ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఆయన సతీమణి రుజీరా బెనర్జీ టీచర్‌ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది. టీచర్‌ కుంభణంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ దంపతులకు పెద్దమొత్తంలో ముడుపులు అందాయని, కేసు విచారణ చేపట్టేందుకు ఢిల్లీకి రావాలని సమన్లు జారీ చేసింది. 

ఢిల్లీకి రాలేను.. మీరే కోల్‌కతాకు రండి
ఇదే అంశంపై ఈడీ జారీ చేసిన సమన్లపై అభిషేక్‌ బెనర్జీ స్పందించలేదు. కేసు దర్యాప్తు చేసేందుకు ఢిల్లీకి రావాలంటూ సమన్లు ఇవ్వడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణను కోల్‌కతాలోని తన నివాసంలోనే విచారించాలని, ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని..ఈడీని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా, విచారణ చేపట్టిన కోర్టు అభిషేక్‌ బెనర్జీ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ఆయన ఢిల్లీలోనే ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు.

నిధులు మళ్లించే.. 
పశ్చిమ బెంగాల్‌ ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో గతేడాది ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో అభిషేక్‌ బెనర్జీ పేరును ప్రస్తావించింది. ఈడీ సమాచారం మేరకు.. ప్రభుత్వ పాఠశాలలో అక్రమ మార్గంలో ఉద్యోగం పొందేలా పలువురు అప్పటి అధికార టీఎంసీ నేతలకు డబ్బులు చెల్లించారు. ఆ నేతల్లో కుంతల్ ఘోష్‌ ఒకరు. కుంతల్‌ ఘోష్‌ తనకు అందిన ముడుపుల్ని అభిషేక్ బెనర్జీకి ఆర్థిక సంబంధిత వ్యవహారాలను నిర్వహించే సుజయ్ కృష్ణ భద్రకు అందించారు. ఆ డబ్బును ప్రైవేట్‌ కంపెనీలకు మళ్లించగా.. ఆ ప్రైవేట్‌ కంపెనీ డైరెక్టర్లలో ఎంపీ అభిషేక్‌ బెనర్జీ భార్య రుజీరా ఒకరని ఈడీ వెల్లడించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)