Breaking News

‘జాతీయ పార్కుల చుట్టూ మైనింగ్‌’పై నిషేధం 

Published on Fri, 11/14/2025 - 05:01

సాక్షి, న్యూఢిల్లీ: వన్యప్రాణుల సంరక్షణ దిశగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాల లోపల, అలాగే వాటి సరిహద్దుల నుంచి కిలోమీటర్‌ పరిధి వరకు ఎలాంటి మైనింగ్‌ కార్యకలాపాలు చేపట్టరాదని తేలి్చచెప్పింది. గతంలో ’గోవా ఫౌండేషన్‌’ కేసులో ఈ రకమైన ఆంక్షలను కేవలం గోవా రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేసిన ధర్మాసనం, ఇప్పుడు ఆ పరిధిని విస్తరింపజేసింది. దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతాయని పేర్కొంది. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ‘రక్షిత ప్రాంతాలకు కిలోమీటర్‌ పరిధిలో మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించడం వన్యప్రాణులకు అత్యంత ప్రమాదకరం. ఇది ఈ కోర్టు స్థిరమైన అభిప్రాయం. గతంలో గోవా ఫౌండేషన్‌ కేసులో ఈ ఆదేశాలు గోవాకు మాత్రమే ఇచి్చనా, వీటిని దేశవ్యాప్తంగా జారీ చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కొత్త ఆదేశాలతో, 2022 జూన్‌ 3న జారీ చేసిన పాత ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించినట్లయింది.  

శరందా అడవులపై విచారణ సందర్భంగా.. 
ప్రఖ్యాత ‘టి.ఎన్‌.గోదావర్మన్‌ తిరుమల్పాడ్‌’ కేసులో భాగంగా దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచి్చంది. ముఖ్యంగా జార్ఖండ్‌లోని ‘శరందా’ ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను కోర్టు పరిశీలించింది. ఈ విచారణలో, శరందా ప్రాంతాన్ని వెంటనే వన్యప్రాణుల అభయారణ్యంగా నోటిఫై చేయాలని జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)