Breaking News

Supreme Court: నిందితుల్ని జైల్లోనే ఉంచడానికి పీఎంఎల్‌ఏ కేసులా?

Published on Fri, 02/14/2025 - 02:44

న్యూఢిల్లీ: నిందితులను జైలులో ఉంచడానికి మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)ను ఉపయోగిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం మాదిరిగా పీఎంఎల్‌ఏ నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎక్సైజ్‌ అధికారి అరుణ్‌ పతి త్రిపాఠీకి బుధవారం బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. త్రిపాఠీపై చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా జైలులోనే ఉంచడంపై విస్మయం వ్యక్తం చేసింది.

 ‘ఓ వ్యక్తిని జైలులో ఉంచేందుకు పీఎంఎల్‌ఏను వాడుకోరాదు. ఆరోపణలను కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆయన్ను విడుదల చేయకుండా జైలులో ఉంచడాన్ని ఏమనాలి?. సెక్షన్‌ 498ఏ కింద పెళ్లయిన మహిళలు భర్త, అతడి కుటుంబీకులపై కట్నం వేధింపుల కేసులు ఎడాపెడా పెట్టినట్లే పీఎంఎల్‌ఏను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా?’అంటూ తలంటింది. ఇందుకు కారణమైన అధికారులకు సమన్లు జారీ చేస్తామంది. అయితే, సాంకేతికపరమైన కారణాలతో నేరగాళ్లకు బెయిలివ్వడం సరికాదని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు ఈడీ తరఫున వాదించారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)