Breaking News

G20 Summit: జీ20 సమావేశాలు విజయవంతం

Published on Sun, 09/10/2023 - 15:54

న్యూఢిల్లీ: భారత రాజధాని ఢిల్లీ వేదికగా అంగరంగవైభవంగా జరిగిన 18వ జీ20 సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగంలో భాగస్వామ్య దేశాలకు కృతఙ్ఞతలు తెలిపి బ్రెజిల్ అధ్యక్షుడికి ప్రెసిడెన్సీ బాధ్యతలను అప్పగించారు.  

బైడెన్ తొలిసారి భారత్‌లో.. 
జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు సమావేశాలు ముగిశాక వియత్నాం బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ మొట్టమొదటిసారి భారత్‌లో పర్యటించారు. జీ20 సమావేశాలు రెండోరోజు ఉదయాన్నే రాజ్‌ఘాట్‌కు వెళ్లి భారత జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన తర్వాత నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన వియత్నాం బయల్దేరారు. సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. 

వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు.. 
జీ20 సమావేశాలు ఒకపక్కన జరుగుతుండగానే ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమావేశాలు తొలిరోజున మారిషస్, బంగ్లాదేశ్ దేశాలతో చర్చలు జరిపారు. రెండో రోజున యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశ నేతలతో సమావేశమయ్యారు. 

ఇక ఆదివారం రోజున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ప్రధాని లంచ్ సమావేశం అది ముగిశాక కెనడా దేశాధినేతలతోనూ అనంతరం కొమొరోస్, తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో భాగంగా కొన్ని కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. 

జయహో భారత్.. 
రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించింది. సమేవేశాలు తొలిరోజునే ప్రధాని ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో భాగస్వామ్యదేశాల ఏకాభిప్రాయం సాధించడం భారత్ సాధించిన అపూర్వ విజయమనే చెప్పాలి. సమావేశాలు  ముగింపు సందర్బంగా ప్రధాని ప్రతిపాదించిన 'వన్ ఎర్త్ నేషన్'పై సభ్యదేశాలు హర్షం వ్యక్తం చేశాయి.  

ఇది కూడా చదవండి: G20 Summit: ఇకపై జీ20 కాదు.. జీ21 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)