Breaking News

Delhi Tragedy: ‘ముగ్గురు కాదు 10 మంది మృతి’

Published on Sun, 07/28/2024 - 11:00

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోగల ఓ స్టడీ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లోకి చేరిన వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఈ సంఘటన అనంతరం విద్యార్థులు అటు కోచింగ్‌ సెంటర్‌పైన, ఇటు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేస్‌మెంట్‌లో ముగ్గురు మాత్రమే కాదు ఎనిమిది నుంచి పది మంది విద్యార్థులు మృతిచెంది ఉంటారని ఓ విద్యార్థి మీడియాకు తెలిపాడు.  ఈ వాదనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై ఒక విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమన్నారు. అరగంట పాటు వర్షం కురిస్తే రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు చేరుతుందన్నారు. దీంతో అప్పుడప్పుడు విపత్తులు జరుగుతుంటాయన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మృతుల వాస్తవ సంఖ్యను వెంటనే వెల్లడించాలని ఆ విద్యార్థి కోరాడు.
 

 

 ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో జరిగిన ఘటనపై ట్విట్టర్‌లో సమాచారాన్ని పంచుకున్న ఢిల్లీ పోలీసులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని తెలిపారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. కాగా యూపీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థి అమన్ శుక్లా మాట్లాడుతూ ముందుగా బేస్‌మెంట్లలో అక్రమంగా నిర్మించిన లైబ్రరీని మూసివేయాలన్నారు.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)