Breaking News

కేంద్రానికి ఎన్నికల సంఘం షాక్‌

Published on Thu, 03/21/2024 - 13:56

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం షాక్‌‌ ఇచ్చింది. ‘వికసిత్‌ భారత్‌’ పేరుతో బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపెయిన్‌ వెంటనే నిలిపివేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో పౌరుల వాట్సాప్‌కు వికసిత్‌ భారత్‌ మెసెజ్‌లు పంపడం తక్షణమే పేయాలని కేంద్ర ఐటీ శాఖకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇకనుంచి ఎలాంటి మెసేజ్ డెలివరీ చేయొద్దని ఆదేశించింది. 

అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల సందేశాలు పౌరుల ఫోన్‌లకు వస్తుండటంతో అనేక ఫిర్యాదులు అందినట్లు ఈసీ పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈసీ ఆదేశాలపై స్పందించిన ఐటీ శాఖ.. ఎన్నికల కోడ్‌కు ముందుగానే మెసెజ్‌లు పంపినప్పటికీ వాటిలో కొన్ని నెట్‌వర్క్‌ కారణంగా ఆలస్యంగా డెలివరీ అవుతున్నట్లు తెలిపింది.  

​కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ ప్రకటించడంతో మార్చి 17 నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇక ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు విడుతల్లో పార్లమెంట్‌, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
చదవండి: డబ్బుల్లేవ్‌.. ప్రచారం చేసుకోలేకపోతున్నాం: కాంగ్రెస్‌ ఆవేదన

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)