Breaking News

గవర్నర్ల కోసం ప్రత్యేక చట్టాలేవి లేవు: స్టాలిన్

Published on Tue, 01/20/2026 - 15:32

తమిళనాడు గవర్నర్ RN రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య మరోసారి వైరం ముదిరిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనను అవమానించారని  అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. గవర్నర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదని అన్నారు. స్టాలిన్ మాట్లాడుతూ " సభనుంచి గవర్నర్ వాకౌట్ చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు భంగం కలిగించడమే. గవర్నర్ తన అభిప్రాయాలను పంచుకునేలా, ఎదైనా చెప్పేలా ఉండే చట్టాలేవి లేవు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా గవర్నర్ మద్దతు ప్రకటించాలి కాని RNరవి అలా చేయడం లేదు" అని స్టాలిన్‌ అ‍న్నారు.

రాష్ట్ర గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రవర్తిస్తుని ఇటువంటి చర్యలు చేయడం వల్ల సభను అవమానపరుస్తున్నారని  తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఉదయం సభను వాకౌట్ చేసిన గవర్నర్ అనంతరం అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. జతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదని తాను చదవాల్సిన ప్రసంగంలో అనేక తప్పులున్నాయని, తన మైక్ ఆప్ చేశారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

అయితే గతంలోనూ తమిళనాడు గవర్నర్ RN రవి తీరు వివాదాస్పదమైంది. ప్రభుత్వం రూపొందించన ప్రసంగం కాకుండా తన స్వంత ప్రసంగాన్ని చదివారు. ఈ వివాదం అప్పట్లో  దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశంమైంది.

Videos

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)