Breaking News

ఢిల్లీలో శ్రీలంక అధ్యక్షుడికి ఘనస్వాగతం

Published on Sun, 12/15/2024 - 20:42

న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే భారత్‌ చేరుకున్నారు. ఆదివారం(డిసెంబర్‌15) సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర సహాయ మంత్రి మురుగన్‌ స్వాగతం పలికారు.

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న దిసనాయకేకు ప్రోటోకాల్‌ ప్రకారం స్వాగతం పలికినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు.

 భారత్‌లో మూడు రోజుల పాటు (డిసెంబరు 15-17 వరకు) దిసనాయకే పర్యటన కొనసాగనుంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం దిసనాయకే మనదేశంలో చేపట్టిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. ఈ పర్యటనలో దిసనాయకే వెంట శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్‌తోపాటు మరో మంత్రి అనిల్‌ జయంత ఫెర్నాండో కూడా ఉన్నారు.

పర్యటనలో తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో దిసనాయకే భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటి అవుతారు. ప్రధానంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం,ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కాగా శ్రీలంకలో సెప్టెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసనాయకే విజయం సాధించిన విషయం తెలిసిందే.దేశ 9వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొవిడ్‌ అనంతర పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)