Breaking News

పూణే తరహాలో మరో హిట్‌ అండ్‌ రన్‌.. బైకర్‌ మృతి

Published on Fri, 08/30/2024 - 07:36

ముంబై: మహారాష్ట్రలో హిట్‌ అండ్‌ రన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఓ మైనర్‌ బాలుడు మద్యం సేవించి కారు నడిపి.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటనలో కారు నడిపిన మైనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాల ప్రకారం.. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున మైనర్‌(17) ఎస్‌యూవీ కారును రాంగ్‌ రూట్‌లో నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న నవీన్‌ వైష్ణవ్‌(24) తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం, కారు పక్కనే ఉన్న కరెంట్‌ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మైనర్‌ గాయపడటంతో కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన తర్వాత మైనర్‌ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు అతడిని పట్టుకున్నారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని నవీన్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నవీన్‌ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, నవీన్‌ వైష్ణవ్‌ ఆ ఏరియాలో పాలు అమ్మే వ్యక్తిగా గుర్తింంచారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్‌ను అరెస్ట్‌ చేశారు. మైనర్‌ను ముంబైకి చెందిన ఇక్బాల్ జివానీ కుమారుడిగా గుర్తించారు. ఈ సందర్భంగా ఇ‍క్బాల్‌పై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు.. ప్రమాదం సమయంలో నిందితుడు మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)