Breaking News

జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన నోటీసు ఇస్తే నిబంధనల ప్రకారమే నడుచుకుంటా 

Published on Fri, 10/23/2026 - 04:26

న్యూఢిల్లీ:  ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కొత్తగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడితే.. నియమ నిబంధనల ప్రకారం దానిని పరిశీలిస్తామని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గురువారం చెప్పారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తప్పించేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే రెండుసార్లు ప్రయతి్నంచాయి. మొదట లోక్‌సభ, రాజ్యసభ నోటీసులు ఇవ్వగా తిరస్కరణకు గురయ్యాయి. 

రెండోసారి సమరి్పంచిన నోటీసు రాజ్యసభలో ఇంకా పెండింగ్‌లో ఉంది. ఓం బిర్లా గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఈసీపై అభిశంసన విషయంలో నిబంధనల ప్రకారమే నడుకుంటానని తేలి్చచెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 

రాజ్యాంగం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టం ప్రకారం.. పదవిలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన ప్రవేశపెట్టిన విధంగానే పార్లమెంట్‌ ద్వారా మాత్రమే సీఈసీని తొలగించవచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల(నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టం–2023 ప్రకారం.. సీఈసీ లేదా ఎన్నికల కమిషనర్‌ రాష్ట్రపతికి లిఖితపూర్వకంగా రాజీనామా సమరి్పంచి, పదవి నుంచి తప్పుకోవచ్చు. 

సుప్రీంకోర్టుకు సంబంధించిన 124వ అధికరణం ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించాలంటే అందుకు తగిన కారణాలు (ప్రవర్తనా లోపం లేదా అసమర్థత) ఉండాలి. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతి సభలోనూ హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి. అటువంటి తీర్మానాన్ని రాష్ట్రపతికి సమర్పించిన తర్వాత.. రాష్ట్రపతి జారీ చేసే ఉత్తర్వు ద్వారా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించవచ్చు. ఒకవేళ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలనుకుంటే ఇదే ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)