Breaking News

అందుకే నా జీవిత కథను నేనే చెప్పాలనిపించింది: సోనియా గాంధీ

Published on Sat, 11/07/2026 - 15:45

న్యూఢిల్లీ: తన జీవితంలో జరిగిన సంఘటనలు, అనుభవాలను ఇతరులు చెప్పడం కంటే తన మాటల్లో తానే వివరించాలనే ఉద్దేశంతో ఆత్మకథ రాయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు. తన జీవిత కథను ఇతరులు రాస్తున్నారని, వాటన్నింటినీ అనుసరిస్తూ ఉండాల్సిన అవసరం లేదని గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, తాను భావించేవారమని తెలిపారు. అయితే ఒకానొక సమయంలో తన కథను తానే చెప్పాలని అనిపించిందని పేర్కొన్నారు.

నా కథను నేనే చెప్పాలనుకున్నా..
సోనియా గాంధీ తన వ్యక్తిగత జ్ఞాపకాలతో రూపొందించిన బిలోంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం రాయడానికి గల కారణాలను శనివారం వివరించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని తన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్‌ చేశారు. ‘‘చాలా ఏళ్ల క్రితమే రాజీవ్, నేను మా గురించి రాసిన విషయాలన్నింటినీ అనుసరిస్తూ ఉండటంలో అర్థం లేదని గ్రహించాం. అయితే నా పుస్తకంలో చెప్పినట్లుగా.. ఒకానొక సమయంలో నా జీవిత కథను నేనే చెప్పాలని అనిపించింది’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.

తల్లికి రాహుల్ గాంధీ అభినందనలు
మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ తన తల్లి జీవిత ప్రయాణాన్ని ప్రశంసించారు. ప్రజా జీవితంలో ఆరు దశాబ్దాలు గడిచినా ఆమె వ్యక్తిత్వం మారలేదని కొనియాడారు. ‘‘ప్రజా జీవితంలో 60 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ అదే వ్యక్తిత్వం. అమ్మా.. నిన్ను చూసి గర్విస్తున్నాను’’ అని ఎక్స్‌లో రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.

తన తల్లి జీవితానికి మార్గనిర్దేశం చేసిన విలువల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘నేను పెరుగుతున్న సమయంలో నేర్చుకున్న విలువలు ఇప్పటికీ నాలో ఉన్నాయి. వాటికి కట్టుబడి ఉండేందుకు నా వంతు ప్రయత్నించాను. కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల నిబద్ధత, ఇతరుల పట్ల నిజాయితీ, సానుభూతి, కర్తవ్యభావం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం.. ఈ విషయాల్లో 60 ఏళ్ల క్రితం రాజీవ్ కలిసిన వ్యక్తినే ఇప్పటికీ నేను’’ అని సోనియా చెప్పిన మాటలను రాహుల్ పంచుకున్నారు.

తన పుస్తకం కేవలం రాజీవ్ గాంధీతో తన ప్రేమకథ మాత్రమే కాదని సోనియా గతంలో ‘ది హిందూ’కు వివరించారు. రాజీవ్ కుటుంబంపై, ఆయనకు చెందిన దేశంపై తనకు ప్రేమ ఎలా పెరిగిందో, ఆ అనుబంధమే చివరకు తనను ప్రజా జీవితంలోకి ఎలా తీసుకొచ్చిందో ఈ పుస్తకంలో వివరించినట్లు తెలిపారు.  

ఇదీ చదవండి: మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకు ముందు జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మరిన్ని కీలక వ్యాఖ్యలు

  • కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, సహా ఇతర పార్టీలకు సమాన అవకాశాలు లేవు

  • 12 ఏళ్లుగా దేశం, ప్రజాస్వామ్యం, సంస్థలపై తీవ్ర నష్టం జరిగింది

  • ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. నష్టాన్ని గుర్తించారు

  • ఎన్నికల కమిషన్‌పై పూర్తి నియంత్రణ, మీడియా, డబ్బు శక్తి, మతం వాడుకుంటున్నారు

  • రోజురోజుకు కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి

  • ఎమర్జెన్సీకి ముందు దేశంలో పరిస్థితులు వేగంగా క్షీణించాయి

  • హింసాత్మక ఆందోళనలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా దహనం… తీవ్ర అశాంతి ఉంది ఉన్నది

  • ఉద్యోగులు, సాయుధ దళాలు ప్రభుత్వం ఆదేశాలు ఉల్లంఘించాలని పిలుపులు వచ్చాయి

  • ఎమర్జెన్సీ అధికాలపై ఇందిరా గాంధీ తర్వాత బహిరంగంగా క్షమాపణ చెప్పారు

  • ఎమర్జెన్సీ నిర్ణయం చివరికి ప్రజాస్వామ్య మార్గంలోనే పరిష్కారమైంది

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)