‘సఫ్దర్‌జంగ్’కు వాంగ్‌చుక్ భార్య హెచ్చరిక

Published on Sat, 07/18/2026 - 10:04

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ విషయంలో, తన అనుమతి లేకుండా ఎటువంటి మందులు లేదా ద్రవ పదార్థాలను అందించవద్దని ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో ఆస్పత్రి యాజమాన్యాన్ని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల పర్యవేక్షణ, వైద్యుల సమ్మతి లేకుండా రోగికి చికిత్స అందించకూడదని ఆమె స్పష్టం చేశారు. స్వయంగా ఆస్పత్రిలో ఉంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆమె ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

నీట్ పరీక్షలో అవకతవకలు, పలువురు విద్యార్థుల మరణాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద గత 21 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమించడంతో, శనివారం పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సలహా మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీర్ఘకాలిక నిరాహార దీక్ష కారణంగా వాంగ్‌చుక్ తీవ్ర నీరసానికి గురయ్యారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. వాంగ్‌చుక్ తరలింపు సమయంలో నిరసనకారులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, పోలీసులు సంయమనంతో వ్యవహరించి ఆయనను సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: ప్రధాని ఇందిర దిగివచ్చేలా.. వాంగ్‌చుక్‌ తండ్రి పోరాటం!

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)