కనిపించని పశ్చాత్తాపం.. జైలు జీవితం బాగుందంటున్న సోనమ్‌

Published on Mon, 07/21/2025 - 21:13

షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్‌ కేసులో నిందితురాలు సోనమ్‌ రఘవంశీకి జైలు జీవితం బాగుందని సమాచారం.

పెళ్లైన 11 రోజులకే హనీమూన్‌ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లిన భర్త రాజా రఘువంశీని అప్పటికే మాట్లాడి పెట్టుకున్న సుపారీ గ్యాంగ్‌తో  సోనమ్‌ రఘువంశీ హత్య చేయించింది. ఇదే కేసులో మేఘాలయా షిల్లాంగ్‌ జైలులో శిక్షను అనుభవిస్తోంది.

నెల రోజుల జైలు శిక్ష పూర్తి చేసుకున్న క్రమంలో ఈక్రమంలో జైల్లో ఉన్న సోనమ్‌ రఘువంశీ గురించి ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైలు నిబంధనల ప్రకారం.. జైల్లో ఉన్న సోనమ్‌ను చూసేందుకు ఆమె కుటుంబసభ్యులకు అనుమతి ఉంది. కానీ ఆమెను చూసేందుకు ఎవరూ రాలేదు. భర్తను చంపేశానన్న పశ్చాత్తాపం సోనమ్‌లో లేదు. 

జైలు వాతావరణానికి తగ్గట్లు తనని తాను మార్చుకుంది. ఇతర మహిళా ఖైదీలతో కలిసిపోతుంది. జైలు నిబంధనల ప్రకారం.. సమయపాలన పాటిస్తోంది. ప్రతి రోజూ టైం ప్రకారం నిద్ర లేస్తోంది. అయితే, తన వ్యక్తిగత జీవితం, భర్తను హత్య చేయించిన విషయాల గురించి జైలు సిబ్బందితో,తోటి ఖైదీలతో మాట్లాడడం లేదని సమాచారం.

ఇక సోనమ్‌ను జైలు అధికారులు జైలు వార్డెన్‌ సమీపంలో ఆమెకు గదిని కేటాయించారు. ఆ గదిలో ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళ ఖైదీలు రూమ్‌ను షేర్‌ చేసుకుంటున్నారు. సోనమ్‌ కుట్టుమిషను ఇతర స్కిల్‌ సంబంధిత పని నేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రతి రోజు తప్పని సరిగా టీవీ చూస్తున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.  

షిల్లాంగ్ జైలులో మొత్తం 496 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 20 మంది మహిళలు. సోనమ్ జైలులో హత్య కేసులో నిందితురాలైన రెండవ మహిళా ఖైదీ.ఆమెను సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)