Breaking News

భార్యను పాము కాటేస్తే..ఆ భర్త చేసిన పనికి వైద్యులు నివ్వెరపోయారు

Published on Mon, 04/17/2023 - 14:55

ఒక మహిళ పాము కాటుకి గురయ్యింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భర్త ఆమెను చూసేందుకు ఆస్పత్రికి రాకపోగా ..పామును పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఉన్నావ్‌ జిల్లా సఫీపూర్‌ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఉమర్‌ అత్వా గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి భార్య కుస్మను పాము కాటేసింది. ఆ మహిళ వంట చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఆ తర్వాత ఈ విషయం ఆమె భర్తకు తెలుస్తుంది. అయితే అతను భార్యను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లకుండా.. నేరుగా ఇంటికి వెళ్లి పామును పట్టుకుని గోనె సంచిలో బంధించి ఆస్పత్రికి తీసుకువచ్చాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వైద్యులు కంగుతిన్నారు. ఎందుకిలా చేశావ్‌ అని అడిగితే.. ఏ పాము కాటేసిందో తెలిసుకుని వైద్యం చేయలని ఆ వ్యక్తి కోరడంతో.. వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఐతే సదరు మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు. వాస్తవానికి ఆ వ్యక్తి భార్యను చూసేందుకు ఆస్పత్రికి ఒక్కసారి కూడా రాకపోవడం గమనార్హం. బదులుగా ఇంటికి వెళ్లి పాముని పట్టుకుని ఆస్పత్రికి తీసుకురావడం విశేషం.

(చదవండి: స్వర్ణ దేవాలయం వద్ద మహిళకు చేదు అనుభవం.. ముఖంపై!)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)