Breaking News

కేతన్‌ హత్యకు నాలుగు నెలలముందే...సీక్రెట్‌ మ్యారేజ్‌

Published on Tue, 07/07/2026 - 11:56

పుణే రియల్టర్‌  కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితురాలు సియా గోయల్, క్రైమ్ జరగడానికి కొన్ని నెలల ముందే మరో నిందితుడు, తన ప్రియుడు చేతన్ చౌదరిని రహస్యంగా వివాహం చేసుకుందని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్, చేతన్ చౌదరి తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా సుమారు నాలుగు నెలల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా వారి మొబైల్ ఫోన్ల నుండి రికవరీ చేసిన వాట్సాప్ చాట్‌లను పరిశీలించినప్పుడు ఈ విషయం బయట పడింది. అలాగే జూన్ 14నే కేతన్‌ను చంపడానికి ప్రయత్నించినా చివరి నిమిషంలో సియా ధైర్యం సరిపోకపోవడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సియా, చేతన్‌కు ఒక మెసేజ్ పంపుతూ.. ఒంటరిగా ఈ పని చేయడానికి తనకు ధైర్యం చాలడం లేదని, ఇద్దరం కలిసి కేతన్‌ను కొండపై నుండి కిందకు నెట్టేద్దామని, కాబట్టి తనతో పాటు రావాలని కోరినట్లు దర్యాప్తులో తేలింది.

ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్‌ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటు

నిందితుల గత ఆరేడు నెలల కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, వాట్సాప్ సంభాషణలు మరియు ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని పోలీసులు విశ్లేషించారు. ఈ డిజిటల్ ఆధారాలు క్రైమ్ ప్లానింగ్‌కు సంబంధించిన కీలక ఆధారాలను అందించాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అలాగే కుటుంబాల నుండి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే సియా, చేతన్ తమ పెళ్లిని రహస్యంగా ఉంచినట్లు చాట్స్ ద్వారా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. వారి రహస్య వివాహం తర్వాతే కేతన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

కాగా  సియా,  ప్రియుడి సహాయంతో, తన  కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను జూన్ 18న లోనావాలా సమీపంలోని చారిత్రాత్మక లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన పోలీసులు సియా, చేతన్ చౌదరిలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు రిమాండ్‌లో ఉన్నారు. 

ఇదీ చదవండి: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి, ఇది గమనించారా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)