Breaking News

Raksha Bandhan: చనిపోయిన చెల్లి స్వయంగా తన చేతితో రాఖీ కడితే..

Published on Sat, 08/09/2025 - 08:25

ఈరోజు రక్షా బంధన్‌.. అక్కాచెల్లెళ్లు తమ అనుబంధానికి గుర్తుగా అన్నదమ్ములకు రాఖీ కడుతుంటారు. కొందరైతే ఈరోజున తమను వీడివెళ్లిన అన్నదమ్ములను అక్కాచెల్లెళ్లను గుర్తు చేసుకుంటారు. వారు తమతోపాటు ఉండి, తమకు రాఖీ కడితే ఎంతో ఆనందంగా ఉండేదని అనుకుంటారు. అయితే ఇటువంటి కల ‘శివమ్‌’ విషయంలో సాకారమయ్యింది. అతని గురించి తెలిసినవారంతా శివమ్‌ను మించిన అదృష్టవంతుడు లేడంటూ కొనియాడుతున్నారు.

గుజరాత్‌లోని వడోదరకు చెందిన 19 ఏళ్ల శివమ్‌ సోదరి రియా బాబీ మిస్త్రీ(9) 2024లో జరిగిన ఒక  రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. అయితే ఆమె చేతిని అవయవమార్పిడి చికిత్స ద్వారా ముంబైకి చెందిన అనమ్తా అహ్మద్(14)కు అతికించారు. ఈ చిన్నారి విద్యుత్ షాక్ కారణంగా తన కుడిచేతిని కోల్పోయినది. అయితే శుక్రవారం శివమ్, అనమ్తా అహ్మద్ కుటుంబాలు భావోద్వేగంతో కూడిన రాఖీ సంబరాలు చేసుకున్నాయి. చనిపోయిన చిట్టి చెల్లి వడోదరకు వచ్చి  శివమ్‌కు రాఖీ కట్టింది.

2022లో విద్యుత్‌ షాక్‌ కారణంగా  తన కుడి చేయిని కోల్పోయిన ముంబైకి చెందిన అనమ్తా అహ్మద్ అవయవ మార్పిడి ద్వారా తిరిగి చేతిని పొందగలిగింది. అమెకు వడోదరకు చెందిన తొమ్మిదేళ్ల రియా బాబీ మిస్త్రీ చేతిని అతికించారు. రియా మెదడులో అకస్మాత్తుగా రక్తస్రావం కావడంతో వైద్యులు ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. రాఖీ కట్టేందుకు తమ ఇంటికి వచ్చిన అనమ్తా అహ్మద్‌ను చూసిన శివమ్‌ పొంగిపోయాడు. మృతిచెందిన తన సోదరే తిరిగి తన దగ్గరకు వచ్చి రాఖీ కట్టిందని శివమ్‌ సంబరపడుతూ తెలిపాడు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)